మునుగోడులో విషాదం: మద్యం తాగి ఇద్దరు మృతి | Two dead after consuming illicit liquor in Vijayawada : Andhra ... | Sakshi
Sakshi News home page

మునుగోడులో విషాదం: మద్యం తాగి ఇద్దరు మృతి

Published Thu, Apr 21 2016 9:09 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Two dead after consuming illicit liquor in Vijayawada : Andhra ...

గుంటూరు : గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడులో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక బెల్ట్ షాపులో ఈ రోజు ఉదయం మద్యం తాగిన జమ్ము నీలయ్య (35), మేకల కాటంరాజు (55) అనే వ్యక్తులు వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.దీంతో స్థానికులు స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వారు మృతి చెందారు. అతిగా మద్యం తాగడం వల్లే వారు మరణించారా లేక కల్తీ మద్యం సేవించి మరణించారా అనే విషయం తేలవలసి ఉంది. ఈ ఘటనపై స్థానికు పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement