మునుగోడు :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, చిన్నకొం డూరు మాజీ ఎమ్మెల్యే కొండవీటి గురునాథ్‌రెడ్డి(94) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కొండవీటి లక్ష్మీనర్సయ్య, నర్సమ్మల దంపతుల నలుగురు సంతానంలో మూడోవారు గురునాథ్‌రెడ్డి. ఈయన 1920లో జన్మించారు. అతను అప్పటి బ్రిటీష్ పాలన పాఠశాలో నాల్గోతరగతి వరకు చదివారు. బ్రిటిష్ పాలకులు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధమయ్యారు. గ్రామంలోని కొందరు రైతు కూలీలు, ఇతర పేద వర్గాలకు చెందిన ప్రజలను కూడగట్టుకొని ముమ్మరంగా ఉద్యమాన్ని కొనసాగించారు.
రజాకార్ల ఆగడాలకు
వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దేశ స్వాతం త్య్ర ఉద్యమంలో భాగంగా బొం బాయిలో జరిగిన సభకు ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లి వచ్చారు. ఇలా ఉద్యమాని సాగిస్తూ అనేకమార్లు జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్రానంతరం రజాకార్లు, భూస్వాముల ఆగడాలు ప్రజలపై పెచ్చు మీరడంతో వాటిని అణచివేసేందుకు మరో మారు ఉద్యమాలకు తెరలేపారు. గ్రామంలోని అతని సోదరులతో పాటు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఏకం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగించారు.
అప్పట్లో గ్రామాల్లో ఉన్న రజాకార్లపై ఆయుధాలతో ప్రత్యక్ష దాడులు నిర్వహించారు. నారాయణపురం మండలంలోని పుట్టపాక, వాయిళ్లపల్లి క్యాంపులపై దాడిచేసి దాదాపు 40 మంది రజాకార్లను మట్టుబెట్టారు. అంతేగాక రజాకార్లకు తొత్తుగా వ్యవహరించిన చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పాశం పుల్లారెడ్డిని అదే గ్రామంలో చంపి, అతని తలను గ్రామ గ్రామాన ఊరేగించారు. ఇలా అనేక విధాలుగా రజాకార్ల చర్యలను తిప్పికొడుతూనే మరో పక్క పోలీసుల కంట పడకుండా ప్రజల పక్షాన ఉంటూ మారువేషాల్లో గ్రామానికి వెళ్తుండేవారు. ఇలా ప్రజలకు అండదండగా ఉంటూ అందరి మన్నలు పొందారు.
1962లో చిన్నకొండూరు ఎమ్మెల్యేగా..
1962లో జరిగిన ఎన్నికల్లో చిన్నకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి కొండ లక్ష్మణ్‌బాబుజీపై గెలుపొందారు. అప్పటి నుంచి ప్రజా సంక్షేమం, ఈ ప్రాంతఅభివృద్ధి కోసం పాటుపడుతూ జీవ నం సాగించారు. వృద్ధాప్యంలోనూ విశ్రాంతి తీసుకోకుండా గ్రామం లో కొందరు దాతల సహకారంతో గ్రంథాలయ, బస్టాండ్ ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ గ్రామాలల్లో సభలు ఏర్పాటుచేసి అందరూ మొక్కలు నాటే విధంగా చైతన్యం చేశారు.
‘కొండవీటి’ ఇకలేరు
Published Mon, Sep 1 2014 2:49 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
Advertisement
Advertisement