అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. స్థానిక రాణినగర్‌కు చెందిన చర్మాస్, శివకుమార్ ఆదివారం అర్థరాత్రి సమయంలో అతిగా మద్యం తాగి ఇంటికి వెళ్తున్నారు. శ్రీకంఠం సర్కిల్ వద్ద వారి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.