రాజు
రాజేంద్రనగర్: మద్యం మత్తులో ఓ యువకుడు నేనేరా పోలీస్.. అంటూ ప్రధాన రహదారిపై హంగామా సృష్టించాడు. పట్టుకునేందుకు వచ్చి న ఇద్దరు పోలీసులను సైతం నెట్టేసి హల్‌చల్ చేశాడు. వచ్చీపోయే ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను ఆపుతూ నానా హడావుడి చేశాడు. ఎట్టకేలకు స్థానిక యువకులు, పోలీసులు అతికష్టం మీద పట్టుకోని స్తంభానికి కట్టేశారు. ఈ తోపులాటలో ఇద్దరు పోలీసుల చొక్కాలతో పాటు స్థానిక యువకుల చొక్కాలు చిరిగిపోయాయి. రాజేంద్రనగర్ పీడీపీ చౌరస్తా వద్ద ఓ యువకుడు(20) పూటుగా మద్యం తాగి రోడ్డుపైకి వచ్చాడు.
తన పేరు రాజు అని, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తానని హంగామా చేశాడు. రోడ్డుపై ఉన్న ఆటోలు, వాహనదారులు, బస్సులను ఆపుతూ హడావుడి చేశాడు. పోలీసుల వలే శరీర కదలికలు ఉండడంతో స్థానికులు నిజమే అని పక్కకు జరుగుతూ వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు కాస్తా జోరు పెంచి చౌరస్తా పైనే వాహనాలను ఆపి పిచ్చి చేష్టలు చేయడం ప్రారంభించాడు. స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు బ్లూ కోట్స్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment