ఒంగోలు : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఒంగోలు - నంద్యాల రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అలి, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... 108 సహాయంతో వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.