bestavaripeta
-
మృతదేహాన్ని తీసుకెళ్తూ చావు ఒడిలోకి
సాక్షి, బేస్తవారిపేట: చనిపోయిన వ్యక్తిని బొలెరో వాహనంలో తరలిస్తున్న సమయంలో లారీని ఢీకొనడంతో మరో ఇద్దరు మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగింది. కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్త్రెవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు పది మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. మోక్షగుండం వద్దకు వచ్చే సమయానికి ముందున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా వేగం తగ్గించి రోడ్డు మార్జిన్లోకి తీస్తున్న సమయంలో వెనుక వైపున బొలెరో ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. కూతురు, అల్లుడు దుర్మరణం.. హైదరాబాద్‌లో మృతిచెందిన వెంకట సుబ్బయ్య మొదటి కుమార్తె గంప సుబ్బలక్ష్మమ్మ(50), చిన్న కుమార్తె రమణమ్మ భర్త ఓరుసు దాసరయ్య(55) లు ఈ దుర్ఘటనలో మృత్యు ఒడిలోకి చేరారు. మృతదేహంతో వెళ్తున్న వాహనం ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్న గిద్దలూరు మండలం బయనపల్లికి చెందిన దాసరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ గుండెపోటుతో వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. సుబ్బయ్య దగ్గరి బంధువులు హైదరాబాద్‌లో ఏడేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడు మరణించడంతో పది మంది మృతదేహాన్ని తీసుకుని వాహనంలో బయలుదేరారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తురక ఉష, లక్ష్మీప్రియల పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తురక పూజ, రమణమ్మ, దంప రమణమ్మలు గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: అయిదో ఫ్లోర్ నుంచి పడి బాలుడు మృతి) మూడు కుటుంబాల్లో విషాదం.. రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న కుమార్తెల కుటుంబాల్లోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. పెద్ద కుమార్తె మరణం, చిన్న కుమార్తె భర్త మరణం, మనవరాళ్లకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా మారడంతో బంధువులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గిద్దలూరు సీఐ యు సుధాకరరావు, బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం
సాక్షి, బేస్తవారిపేట : పురాణేతిహాసాలు.. పర్యావకరణ పరిరక్షణ.. వివిధ రాష్ట్రాల ఆచారాలు.. వేషభాషలు.. పండుగుల ప్రాధాన్యత.. ఇలా సమస్త విషయాలను ఒక గదిలో కళ్లకు కట్టినట్లు చూపే ఘట్టాలు బొమ్మల కొలువులో మాత్రమే ఆవిష్కృతమవుతాయి. దసరా పండుగ వైశిష్ట్యాన్ని ఘనంగా చాటే ఈ వేడుకను జిల్లాలోని పలు చోట్ల భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో అందించే బొమ్మల కొలువు సంప్రదాయాన్ని నియమనిష్టలతో పాటిస్తున్న వారందరూ ఇప్పటి తరం వారికి మన సంస్కృతిని మరచిపోకుండా కాపాడుకుంటూ రెండు తరాల వారధిగా నిలుస్తున్నారు. కొలువు.. సులువు కాదు ఒకప్పుడు దసరా వస్తోందంటే ఇంటింటా అందమైన బొమ్మలు కొలువుదీరేవి. వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచేవి. బొమ్మల కొలువును తీర్చిదిద్దడం అంత సులువైన పని కాదనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఎక్కువ మొత్తంలో కొనుక్కోవడం, వాటిని జాగ్రత్తగా పదిలపరచడం అవసరం. భవిష్యత్తు తరాల వారికి పాత సంప్రదాయాలను అందించాలన్న ఉద్దేశంతో పాతతరం వారు బొమ్మల కొలువును ఇప్పటికీ అందంగా అందిస్తున్నారు. కొన్ని చోట్ల దసరా పండుగను కలిసికట్టుగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తూ మళ్లీ పాత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బొమ్మల కొలువు సంప్రదాయం అనాదిగా వస్తున్న బొమ్మల కొలువు సంప్రదాయం వెనుక అనేక కారణాలున్నాయి. పూర్వం లలితకళల్లో ప్రధానమైన శిల్పకళను ప్రోత్సహించడానికి, జీవకళతో ఉట్టిపడే కళారూపాలను తయారు చేసే కళాకారులను బతికించడానికి అందరి చేత బొమ్మలు కొనిపించేవారు. సినిమాలు, టీవీలు లేని రోజుల్లో బొమ్మల కొలువు ద్వారా పురాణాల్లోని కథలను, విజ్ఞాన విషయాలను చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకుని పదిరోజులపాటు వీలు దొరికినప్పుడల్లా తెలియజేసేవారు. ఇవన్నీ ఇలా ఉంటే ముత్తయిదువులు, చిన్నారులకు బొమ్మలకొలువు ముందు నిత్యం తాంబూలాలు ఇవ్వాలనే సంప్రదాయం కూడా బాంధవ్యాలను మరింత దగ్గర చేసేది. కాలక్రమంలో బొమ్మల కొలువులు పెట్టే వారు తగ్గిపోయారు. -
షాక్ కొడుతున్న విద్యుత్ బిల్లులు
బేస్తవారిపేట : విద్యుత్ బిల్లులు చూసిన ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. మండలంలోని 19 పంచాయతీల్లో అనేక మందికి అధిక బిల్లులు రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూరిళ్లు, పెంకుటిళ్లు, మధ్య తరగతి కుటుంబాలకు వేలకు వేలు బిల్లులు వస్తుండటంతో బెంబేలెత్తున్నారు. కొత్తవారి రాకతో.. మండలంలో ప్రైవేట్ ఏజెన్సీ నుంచి రీడర్స్‌ను పెట్టి ప్రతినెలా మీటర్ రీడింగ్‌లను తీయిస్తున్నారు. రీడర్స్ సక్రమంగా రీడింగ్ తీయకుండా ఇష్టారాజ్యంగా అరకొర యూనిట్లను నమోదు చేశారు. ఈ విధంగా నాలుగైదు ఏళ్లపాటు జరిగింది. గతంలో రీడింగ్ నమోదు చేసిన ప్రైవేట్ వ్యక్తులు మానుకోవడంతో ఏజెన్సీలు కొత్త రీడర్స్‌ను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన రీడర్స్ మీటర్లో ఉన్న రీడింగ్‌ను యథాతధంగా నమోదు చేయడంతో వేలకు వేలు బిల్లులు వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లులు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పూరింటిలో నివసించేవారికి కూడా రూ.45 వేల బిల్లు వచ్చింది. అంత బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. మండలంలోని 46 గ్రామాల్లో ఇప్పటికే 200 మందికి అధిక బిల్లులు వచ్చాయి. జూన్ నెలకు బిల్లులు తీస్తుండటంతో ఇంకా అధిక బిల్లుల మోత బయటపడున్నాయి. కార్యాలయాల చుట్టూ పరుగులు.. వేలకు వేలు బిల్లులు రావడంతో బిల్లులు తీసుకుని విద్యుత్ ఏఈ కార్యాలయం వద్దకు వినియోగదారులు పరుగులు పెట్టారు. రూ.10 వేలలోపు బిల్లులు వచ్చినవారికి ఆర్జే(రెవెన్యూ జనరల్) కంభం విద్యుత్ ఏడీఈ, బేస్తవారిపేట విద్యుత్ ఏఈ పరిధిలో పరిష్కరించే అవకాశముందని తెలిపారు. రూ.10 వేలపైన వచ్చిన వినియోగదారుల అర్జీలను తీసుకుని ఒంగోలు విద్యుత్‌శాఖ ఎస్ఈకి పంపారు. రెండు నెలలుగా అర్జీలు ఇచ్చిన అధిక బిల్లులు వస్తున్నాయని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవిధంగా చెల్లించాలి : నాకుటుంబం నివసించేది పూరింట్లో. ప్రతి నెలా 100 కరెంట్ బిల్లు వచ్చేది. జూన్ నెలలో కరెంట్ బిల్లు రూ.45862 వచ్చింది. ఒక్క నెలలోనే 6637 యూనిట్లు వినియోగించినట్లు వచ్చింది. కూలి పనులు చేసుకునే మేము ఏ విధంగా బిల్లులు చెల్లించాలి. – వల్లల రంగయ్య(అక్కపల్లె) -
మూతపడిన హోమియో వైద్యశాల
బేస్తవారిపేట: ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. వైద్యశాలకు డాక్టర్‌ను, కాంపౌండర్, స్వీపర్‌ను కాని నియమించకపోవడంతో హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారింది. మండలంలోని గలిజేరుగుళ్ల హోమియో వైద్యశాలకు డాక్టర్ లేకపోవడంతో మూతపడింది. మూడేళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి వైద్యశాలకు డాక్టర్‌ను నియమించలేదు. కనీసం వైద్యశాలకు ఇన్ఛార్జీని ఎర్పాటు చేసేవిధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులు బాగ పనిచేస్తుండటం, వ్యాధి నయమైన తర్వాత తిరిగి రాకపోవడంతో నిత్యం అధిక సంఖ్యలో రోగులు వైద్యశాలకు వస్తున్నారు. వైద్యశాల పరిధిలోని 18 గ్రామాల ప్రజలు హోమియో వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్థుతం వైద్యశాల మూతపడటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ ఉన్నాడని వైద్యశాలకు వచ్చినవారు నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఏంతో విలువైన హోమియో మందులు వైద్యశాలలో ఉన్నప్పటికి ప్రజలకు అందకుండా పోతున్నాయి. హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండని కారణంగా ప్రజలు హోమియోపతి పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జుట్టు, చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల వాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా థైరాయిడ్, పడకతడపడం, మధుమేహం, ఊబకాయం వంటి ఇతర రోగాలకు హోమియో మందులు బాగ పనిచేస్తాయి. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని వైద్యశాలకు డాక్టర్‌ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకొని హోమియో వైద్యశాలకు డాక్టర్‌ను నియమించాలి. మూడేళ్లుగా డాక్టర్లేక వైద్యశాల మూతపడింది. నిత్యం ప్రజలు వైద్యశాలకు వచ్చి వెనుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఎక్కువగా హోమియో మందులు వాడుతున్నారు. -రమణయ్య వైద్యశాలలో విలువైన మందులు ఉన్నప్పటికి డాక్టర్ లేకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. హోమియో మందులు ఏటువంటి సైడ్ ఏఫెక్ట్లు ఉండని కారణంగా దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే వైద్యశాలకు డాక్టర్‌ను నియమించక పోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -నారాయణ -
పది రూపాయల కోసం..
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): పది రూపాయల కోసం ఓ వ్యక్తి, తొమ్మిదేళ్ల బాలుడ్ని సిగరెట్లతో కాల్చి హింసించాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునంబాగ్ గ్రామానికి చెందిన వెంకట్రావు(9) బుధవారం ఉదయం 11 గంటలకు గోళీలాట ఆడుకుందామని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన నరేంద్ర అనే యువకుడు బాలుడిని తన ఇంట్లో నిర్బంధించి సైకిల్ ట్యూబ్‌తో కొట్టి సిగరెట్లతో కాల్చాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎక్కడ విషయం బయటపడుతుందోనని భయపడిన నరేంద్ర, బాలుడిని ఊరు చివరన ఉన్న చిల్ల కంప దగ్గరకు తీసుకెళ్లాడు. ఎవరైనా అడిగితే యాక్సిడెంట్ అయిందని చెప్పు అని బాలుడితో చెప్పడం అటుగా వెళ్తున్న ఓ మహిళ గమనించింది. బాలుడి వద్దకు వెళ్లి విచారించగా విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది రూపాయల కోసం తనను హింసించాడని బాలుడు చెబుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రెండు లారీలు ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద ఒంగోలు - నంద్యాల రహదారిపై శనివారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అలి, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ... 108 సహాయంతో వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఈత సరదా
బెస్తవారిపేట : ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని బూదవాడలో గ్రానైట్ క్వారీ గుంతల్లో ఈత కోసం దిగిన ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. బెస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం గ్రామానికి చెందిన కిన్నెర పవన్‌కుమార్ (14), సూర్యబోయిన వెంకట శివరామకృష్ణ (12) సంక్రాంతి సెలవుల నేపథ్యంలో బూదవాడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం సమీపంలోనే వినియోగంలో లేని గ్రానైట్ క్వారీల గుంతల్లో నీరు నిలిచి ఉన్న వాటిలోకి ఈత కోసం దిగి..ఆ నీటిలో మునిగి మృతి చెందారు. -
ఉపాధి పనుల పరిశీలన తప్పనిసరి
బేస్తవారిపేట : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులను నెలలో రెండుసార్లు తప్పనిసరిగా పరిశీలించాలని డ్వామా పీడీ ఎన్.పోలప్ప టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల టెక్నికల్ అసిస్టెంట్లతో స్థానిక ఐడబ్ల్యూఎంపీ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఉద్యానవన పనులను వేగవంతం చేయాలని సూచించారు. వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు, రైతులతో సమావేశాలు నిర్వహించి హార్టీకల్చర్‌పై అవగాహన కల్పించాలన్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా రైతులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. హార్టీకల్చర్ పనుల అనంతరం బిల్లులిప్పించే బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పంచాయతీల వారీగా ప్లాంటేషన్‌పై సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా హార్టీకల్చర్ ప్లాంటేషన్ అధికారిణి ఎస్.వెంకటరత్న, ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్ అధికారి ఎం.రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. గిట్టుబాటు కూలి కల్పించాలి... ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలి కల్పించే బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపైనే ఉందని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. బేస్తవారిపేటలోని ప్రాంతీయ జీవనోపాధుల వనరుల కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని ఏపీవో, టీఏలు, ఎఫ్ఏలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పంచాయతీలో పనిదినాలు పూర్తిచేయాలని, కచ్చితమైన కొలతలు ఇచ్చిన కూలీలకు రోజుకు రూ.150 కూలి పడేలా చూడాలని సూచించారు. బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని సిబ్బందిని హెచ్చరించారు. పనిచేసిన 15 రోజుల్లోపే కూలీలకు కూలి మంజూరు చేయాలన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ ఎస్.వెంకటరత్న, ఏపీడీ హరికృష్ణ, ఏపీఓ, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. -
అత్తను చంపి.. భార్యను బెదిరించి...
* నాటు తుపాకీతో పరారైన హంతకుడు * పోగుళ్లను జల్లెడ పట్టిన పోలీసులు బేస్తవారిపేట : అత్తను నాటు తుపాకీతో చంపి.. దానితోనే భార్యను బెదిరించి పరారైన వ్యక్తి ఉదంతం ఇది. మండలంలోని పోగుళ్లలో అత్త తిరుమలమ్మ(55)ను అల్లుడు అల్లూరయ్య ఆదివారం రాత్రి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని గిద్దలూరు సీఐ నిమ్మగడ్డ రామారావు తన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై వి.నాగశ్రీను ఆధ్వర్యంలో తిరుమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. పోగుళ్లలో నాటు తుపాకీతో హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌పార్టీ పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టారు. కుమారునికి కొత్త దుస్తులు తేలేదనే.. గ్రామంలో ఆదివారం పోలేరమ్మ జాతరతో పాటు హంతకుడు అల్లూరయ్య కొడుకు పురిటి స్నానం చేయించారు. ఈ సందర్భంగా అల్లూరయ్య పూటుగా మద్యం తాగాడు. తన కొడుకుకు నూతన దుస్తులు తీసుకురాలేదని అత్తింటి వారితో గొడవకు దిగాడు. గొడవ పెద్దదవుతుండటంతో అత్త ఇంటికి ఎదురుగా ఉన్న తన ఇంట్లో అల్లూరయ్యను పెట్టి తాళం వేశారు. అక్కడ దాచి ఉంచిన నాటు తుపాకీతో ఎదురు దబ్బల తలుపు సందులోంచి కాల్చాడు. అత్త తిరుమలమ్మ కడుపులో తుపాకీ గుండు దిగబడి బయటకు వచ్చింది. ఆమె పక్కనే ఉన్న మనుమడు కళ్యాణ్ చేతులకు గాయాలయ్యా యి. తీవ్రంగా గాయపడిన తిరుమలమ్మను మంచంపై పడుకోబెట్టి రోడ్డుపైకి తీసుకొచ్చేలోపే ఆమె మృతి చెందింది. సంఘటన జరిగిన వెంటనే అల్లూరయ్య తన ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. భార్యాబిడ్డపై గురిపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి తుపాకీతో సహా పరారయ్యాడు. -
రేషన్‌కు సర్వర్ చిక్కులు
బేస్తవారిపేట: రేషన్ కార్డులకు ఆధార్ నమోదు ప్రక్రియకు సర్వర్‌లో సమస్య తలెత్తింది. కార్డుదారులకు సంబంధించిన ఆధార్ నంబర్లను రెవెన్యూశాఖ అధికారులకు డీలర్లు అందించినప్పటికీ కార్డులకు ఆధార్ అనుసంధానం కాలేదు. ఒక్క బేస్తవారిపేట మండలంలోనే 11748 కార్డుల్లో ఉన్న 42,617 మందిలో 8,729 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. డీలర్లు ఒకటికి రెండు సార్లు ఆధార్ నంబర్లను ఇచ్చినప్పటి కీ సర్వర్‌లో ఉన్న సమస్యతో అనుసంధానం కావడం లేదు. జిల్లా అంతటా ఇలాంటి సమస్య తలెత్తడంతో ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ప్రతినెల 16వ తేదీన తహ శీల్దార్ కార్యాలయంలో డీలర్లకు తహశీల్దార్ సమావేశం ఏర్పాటు చేసి స్టాక్ వివరాలు నమోదు చేసుకుంటారు. జేసీ ఆదేశాల మేరకు రేషన్ అలాట్మెంట్ వస్తుంది. 20, 21వ తేదీల్లో డీలర్లు అలాట్మెంట్ ప్రకారం డీడీలు తీయాలి. 23వ తేదీకి తీసిన డీడీలను రేషన్ గోడౌన్ డీటీకి అందజేయాలి. 25వ తేదీ నుంచి అన్నీ మండలాల్లోని మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు లారీల్లో రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. ఒకటో తేదీ నుంచి రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. నేటికీ జేసీ నుంచి అలాట్మెంట్ రాకపోవడంతో డీలర్లు డీడీలు చెల్లించలేదు. సర్వర్‌లో వచ్చిన సమస్యను అధికారులు పరిష్కరించకపోవడంతో సకాలంలో పేదలకు రేషన్ పంపిణీ జరిగే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 8.90 లక్షల మంది తెలుపు రంగు కార్డుదారులున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,085 ప్రజాపంపిణీ దుకాణాల్లో వేల సంఖ్యలో కార్డుదాల ఆధార్ నమోదు జరగలేదు. అయోమయంలో డీలర్లు సక్రమంగా ఆధార్ నంబర్లను అందజేసినప్పటికీ ఒకే కుటుంబంలో ఒకరిద్దరికి ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రేషన్‌షాపు పరిధిలో 75 నుంచి 405 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. కుటుంబంలో ఒకరిద్దరికి ఆధార్ అనుసంధానం జరగకపోవడంతో గ్రామాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఆధార్ అనుసంధానమైన వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేయాల్సి వస్తే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుందోనని భయపడుతున్నారు. ప్రారంభంలో కార్డులకు ఆధార్ అనుసంధానం చేసేటప్పుడు సమస్యలు వచ్చాయి. జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. నూరు శాతం రేషన్‌కార్డులకు ఆధార్ నమోదు కోసం సర్వర్‌లో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ఆధార్ నంబర్ తీసుకోని వారిని రిజెక్ట్ కింద నమోదు చేశారు. నేడు సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. -
కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు
బేస్తవారిపేట :వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుల్లో ఒకరి భార్య తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండలంలోని పెంచికలపాడు బస్టాండ్ సమీపాన ఒంగోలు నంద్యాల హైవే రోడ్డుపై బుధవారం జరిగింది. వివరాలు.. నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన తాళ్ల శ్రీనివాస్(55) పక్షవాతం తో బాధపడుతున్నాడు. కర్నూలు జిల్లా గుండుపాపలలో పసురు మందు తాగేం దుకు తన భార్య రమణమ్మతో కలిసి ఇండికా కారులో బయల్దేరాడు. డ్రైవర్ శిరికొండ అశోక్(40) నిద్ర మత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టిం ది. కారు నుజ్జునుజ్జు కావడంతో అందు లో దంపతులతో పాటు డ్రైవర్ కూరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. పెంచికలపాడు గ్రామస్తులు సంఘటన స్థలాని కి వచ్చి కారులో ఇరుక్కుపోయిన ముగ్గురిని అతికష్టం మీద బయటకు తీసి 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు. చికిత్స అందించేలోపు తీవ్రంగా గాయపడిన అశోక్ మృతిచెం దాడు. గంట తర్వాత పక్షవాతంతో బాధపడుతున్న శ్రీనివాస్ కూడా ప్రాణా లు విడిచాడు. ఆయన భార్య రమణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. -
సర్వీసు ఓటు వృథానే..!
ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్న సర్వీసు ఓటర్లు తప్పుల తడకగా ఓటర్ల జాబితా మృతి చెందిన ఆర్మీ ఉద్యోగులకూ ఓటు రిటైర్డ్ అయినవారికీ పోస్టల్ బ్యాలెట్టే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటూ నమోదు కాలేదు చిరునామాలు తప్పని తిరుగు టపా ఓటు వేయలేని పరిస్థితిలో జిల్లాలోని 7039 మంది సర్వీస్ ఓటర్లు బేస్తవారిపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సర్వీస్ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోంది. జిల్లాలో 7039 మంది సర్వీస్ ఓటర్లున్నారు. వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపాల్సి ఉంది. అస్సాం, జమ్ము కాశ్మీర్, నీలగిరి,బెంగళూరు, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల్లో సైనిక ఓటర్లున్నారు. ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒంగోలులో బ్యాలెట్లు ముద్రించి తీసుకురావాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఎంపీటీసీల సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను తయారు చేయాలి. పోస్ట్‌ద్వారా పంపడానికి కనీసం మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. బేస్తవారిపేట మండలంలో 602 మంది సర్వీస్ ఓటర్లందరూ సైనికులే. ఓటర్ల జాబితాలో రెజిమెంట్ మాత్రమే నమోదు చేసి ఉండటంతో అక్కడి నుంచి పనిచేసే స్థానానికి పంపడానికి మరికొన్ని రోజులు పడుతుంది. వచ్చే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్‌ను పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో మండల అధికారులకు నిధులు విడుదల చేయకపోవడం ఓ కారణం. జమ్ము, కాశ్మీర్ వంటి దూర ప్రాంతాలకు బ్యాలెట్లను స్పీడ్ పోస్ట్‌లో పంపాలంటే ఒక్కో దానికి * 50 ఖర్చవుతుంది. బేస్తవారిపేట మండలంలోని 602 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి * 30 వేలు ఖర్చవుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చును నేటికీ అధికారులకు అందజేయలేదు. మళ్లీ పోస్టల్ ఖర్చు తడిసిమోపడవుతుందని సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సక్రమంగా లేని జాబితా: ఏడు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంపిన సర్వీస్ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పంపారు. చనిపోయిన, విశ్రాంత ఉద్యోగులకు ఓట్లు వచ్చాయి. రిటైర్డ్ అయినవారికి బ్యాలెట్లను గతంలో పనిచేసిన ప్రాంతాలకు పంపుతుండటంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వ స్తోంది. ఆర్మీ ఉద్యోగులకు మొదట పనిచేసిన చిరునామాలను నెట్లో ఉంచడంతో వారుకూడా ఓటు వినియోగించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోనే అత్యధికంగా సర్వీస్ ఓట్లున్న గిద్దలూరు నియోజకర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పంపిన బ్యాలెట్లు ఓటు వేయకుండానే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుప్పలుగా అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని వెనక్కువచ్చాయి. ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు సకాలంలో ఓటర్లకు బ్యాలెట్లు అందేలా, మారిన చిరునామాలను సవరించేలా చర్యలు తీసుకోవాలని సర్వీస్ ఓటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ రామకృష్ణరాజును వివరణ కోరగా సర్వీస్ ఓటర్ల జాబితాను రెండు రోజుల క్రితం అందజేశారని, మండలంలోని 19 పంచాయతీల్లో ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి పోస్టల్ బ్యాలెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పంపిన 602 పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ముగిసిన పది రోజుల తరువాత వెనక్కువచ్చాయని, ఒక్క ఓటుకూడా నమోదు కాలేదని చెప్పారు. -
ఇంటర్ విద్యార్థి గృహ నిర్బంధం
బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : ఆ విద్యార్థి చేసిన తప్పేం లేదు. తన అన్న స్నేహితుడు ఓ బాలికను ప్రేమించాడట.. అందుకు ఈ విద్యార్థి సహకరించాడట.. అంతే బాలిక తల్లిదండ్రులకు కోపం వచ్చింది. తమ కుమార్తె ప్రేమలో పడేందుకు నీవే కారణమంటూ సదరు విద్యార్థిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ సంఘటన బేస్తవారిపేట పట్టణంలోని నెహ్రూ బజార్లో ఈ నెల 14వ తేదీ జరగగా 19వ తేదీ రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. బేస్తవారిపేటకు చెందిన దూదేకుల మలాన్‌షా కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బండిపై టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే వాగిచర్ల సుబ్బారావు కుమారుడు పార్థసార థి అదే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మలాన్‌షా కుమార్తె, పార్థసారథి అన్న స్నేహితుడు దూదేకుల బాషాలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందులో పార్థసారథి ప్రమేయం ఉందని బాలిక తల్లిదండ్రులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో నెహ్రూ వీధి నుంచి వెళ్తున్న పార్థసారథిని బాలిక తల్లిదండ్రులు అటకాయించారు. నీతో మాట్లాడాలంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. వెంటనే తలుపులు మూసేసి బాలిక తండ్రి మలాన్‌షా, బాబాయి ఖాజా ఒక్కసారిగా పార్థసారథిపై దాడికి దిగారు. కాళ్లు, చేతులతో ఇష్ట మొచ్చినట్లు కొట్టి బలవంతంగా చేతులు పట్టుకున్నారు. బాలిక తల్లి ఒకడుగు ముందుకు వేసి గరిటను ఎర్రగా కాల్చి పార్థసారథి మెడ ఎడమ భాగం, కుడి చేతిపై, రెండు కాళ్లపై విచక్షణా రహితంగా వాతలేసింది. విద్యార్థి అరుపులు బయటకు వినపడకుండా టీవీ సౌండ్ పెంచారు. గట్టిగా అరిచినా.. బయట వెళ్లేందుకు ప్రయత్నించినా చంపుతామని బెదించారు. రాత్రి 11 గంటల సమయంలో పార్థసారథి కోసం బాబాయి, అన్న వెతుకుతుండగా మలాన్‌షా ఇంటి సమీపాన మోటార్ సైకిల్ ఉండటాన్ని గమనించి నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది. ఇంట్లో నుంచి పార్థసార థిని బయటకు తీసుకెళ్తుండగా జరిగిన విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తామని బెదిరించిడంతో బాధితులు మిన్నకుండిపోయారు. కుల పెద్దల సహకారంతో ఐదు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్థసారథిని చికిత్స కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మందలించాడని బాలిక ఆత్మహత్యాయత్నం ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అనుచరులు బొంతల లక్ష్మణ్, దొమ్మ పార్థసారథి, ఖాదర్‌బాషా, ఇండ్ల మహేశ్వరరెడ్డి, ఎల్లారావు, మట్టా రమేశ్‌లు ఇబ్బంది పెడుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన తనను ఎస్సై దుర్బా షలాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చిం దని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దూదేకుల మలాన్‌షా కుమార్తె కైరూన్ పేర్కొంది. నాయనమ్మ కోసం తెచ్చిన మాత్రలు మింగి శుక్రవా రం ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కుటుంబ సభ్యులు బా లికను ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది. బాలిక తండ్రి, బా బాయి ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పార్థసారథిపై దాడి కేసును తప్పుదోవ పట్టించేందుకు డ్రామా ఆడుతున్నారని ఎస్సై రమేశ్‌బాబు అభిప్రాయపడ్డారు.