బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : ఆ విద్యార్థి చేసిన తప్పేం లేదు. తన అన్న స్నేహితుడు ఓ బాలికను ప్రేమించాడట.. అందుకు ఈ విద్యార్థి సహకరించాడట.. అంతే బాలిక తల్లిదండ్రులకు కోపం వచ్చింది. తమ కుమార్తె ప్రేమలో పడేందుకు నీవే కారణమంటూ సదరు విద్యార్థిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ సంఘటన బేస్తవారిపేట పట్టణంలోని నెహ్రూ బజార్‌లో ఈ నెల 14వ తేదీ జరగగా 19వ తేదీ రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. బేస్తవారిపేటకు చెందిన దూదేకుల మలాన్‌షా కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బండిపై టిఫిన్ అమ్ముకుని జీవనం సాగించే వాగిచర్ల సుబ్బారావు కుమారుడు పార్థసార థి అదే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మలాన్‌షా కుమార్తె, పార్థసారథి అన్న స్నేహితుడు దూదేకుల బాషాలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అందులో పార్థసారథి ప్రమేయం ఉందని బాలిక తల్లిదండ్రులు అనుమానించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో నెహ్రూ వీధి నుంచి వెళ్తున్న పార్థసారథిని బాలిక తల్లిదండ్రులు అటకాయించారు. నీతో మాట్లాడాలంటూ ఇంట్లోకి తీసుకెళ్లారు. వెంటనే తలుపులు మూసేసి బాలిక తండ్రి మలాన్‌షా, బాబాయి ఖాజా ఒక్కసారిగా పార్థసారథిపై దాడికి దిగారు. కాళ్లు, చేతులతో ఇష్ట మొచ్చినట్లు కొట్టి బలవంతంగా చేతులు పట్టుకున్నారు. బాలిక తల్లి ఒకడుగు ముందుకు వేసి గరిటను ఎర్రగా కాల్చి పార్థసారథి మెడ ఎడమ భాగం, కుడి చేతిపై, రెండు కాళ్లపై విచక్షణా రహితంగా వాతలేసింది. విద్యార్థి అరుపులు బయటకు వినపడకుండా టీవీ సౌండ్ పెంచారు. గట్టిగా అరిచినా.. బయట వెళ్లేందుకు ప్రయత్నించినా చంపుతామని బెదించారు. రాత్రి 11 గంటల సమయంలో పార్థసారథి కోసం బాబాయి, అన్న వెతుకుతుండగా మలాన్‌షా ఇంటి సమీపాన మోటార్ సైకిల్ ఉండటాన్ని గమనించి నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది. ఇంట్లో నుంచి పార్థసార థిని బయటకు తీసుకెళ్తుండగా జరిగిన విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తామని బెదిరించిడంతో బాధితులు మిన్నకుండిపోయారు. కుల పెద్దల సహకారంతో ఐదు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్థసారథిని చికిత్స కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఎస్సై మందలించాడని బాలిక ఆత్మహత్యాయత్నం
ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అనుచరులు బొంతల లక్ష్మణ్, దొమ్మ పార్థసారథి, ఖాదర్‌బాషా, ఇండ్ల మహేశ్వరరెడ్డి, ఎల్లారావు, మట్టా రమేశ్‌లు ఇబ్బంది పెడుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన తనను ఎస్సై దుర్బా షలాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చిం దని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దూదేకుల మలాన్‌షా కుమార్తె కైరూన్ పేర్కొంది. నాయనమ్మ కోసం తెచ్చిన మాత్రలు మింగి శుక్రవా రం ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. కుటుంబ సభ్యులు బా లికను ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు బాలిక సూసైడ్ నోట్‌లో పేర్కొంది. బాలిక తండ్రి, బా బాయి ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పార్థసారథిపై దాడి కేసును తప్పుదోవ పట్టించేందుకు డ్రామా ఆడుతున్నారని ఎస్సై రమేశ్‌బాబు అభిప్రాయపడ్డారు.
ఇంటర్ విద్యార్థి గృహ నిర్బంధం
Published Sat, Sep 21 2013 4:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement