వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
Published Mon, Aug 29 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ఏలూరు అర్బన్ : రెండు వేర్వేరు ప్రమాదాల్లో రైలు నుంచి జారిపడి ఒకరు, రైలు ఢీకొని మరొకరు మృతిచెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గన్‌బజార్ సెంటర్‌లో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుడి చేతిపై రాజేశ్వరి, సీతారామమ్మ అనే పచ్చబొట్టు ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రైల్వేపోలీసులు తెలిపారు.
రైలు నుంచి జారిపడి..
భీమడోలు–దెందులూరు మధ్య రాజమండ్రి నుంచి విజయవాడ Ððళ్తున్న పాసింజర్ రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మరణిం చాడు. మృతుని వయసు 45 ఏళ్లు ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు, నలుపు, తెలుపు చారల చొక్కా, ఖాకీ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం తెలిసిన వారు తమకు తెలియజేయాలని రైల్వే పోలీసులు కోరారు.
అనారోగ్యంతో యువకుడు
హౌరాకు చెందిన రామకృష్ణ సర్దార్ (27) అనే యువకుడు ఆదివారం అనారోగ్యంతో ఏలూరు రైల్వే ప్లాట్‌ఫాంపై మృతిచెందాడు. ౖÆðల్వే పోలీసుల వివరాల ప్రకారం.. హౌరాకు చెందిన సర్దార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. రైలు విజయవాడ దాటిన సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడం గుర్తించిన టీసీ బాధితుడిని వైద్య సహాయం నిమిత్తం ఏలూరు రైల్వేస్టేçÙన్‌లో దింపి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు లు అతడ్ని ఆస్పత్రికి తరలించే యత్నంలో ఉండగా సర్దార్ కన్నుమూశాడు.
Advertisement