అనంతపురం : జిల్లాలో ఖాళీపడ్డ మునిసిపల్ కౌన్సిల్ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులు, ఏకగ్రీవమైన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. రాయదుర్గం మునిసిపాలిటీలో ఎనిమిదో వార్డుకు ముదిగల్లు జ్యోతి, పామిడి నగర పంచాయతీ 18వ వార్డుకు బోయ సువర్ణ, తాడిపత్రి మునిసిపాలిటీ ఆరో వార్డుకు రసూల్‌బీ ఏకగ్రీవమయ్యారు. హిందూపురం మునిసిపాలిటీలో తొమ్మిదో వార్డుకు శాంత (టీడీపీ), రాధ (కాంగ్రెస్)ల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. తాడిపత్రి నాలుగో వార్డుకు షబ్బీర్ (వైఎస్సార్‌సీపీ), లక్ష్మీదేవి (టీడీపీ), రియాజ్ (ఇండిపెండెంట్)ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.