భక్తులందరికీ సంతృప్తికర దర్శనాలు
- ఉచిత దర్శన, శీఘ్ర దర్శన క్యూ(రూ.200లు), అతిశీఘ్ర దర్శనం (రూ.500లు)క్యూల ద్వారా భక్తులను స్వామివార్ల దర్శనానికి అనుమతిస్తామన్నారు.
- భక్తుల సౌకర్యార్థం స్వామివారి ఆర్జిత అభిషేకాలను శ్రీవృద్ధమల్లికార్జునస్వామివారి వద్ద, ఆర్జిత కుంకుమార్చనలను అమ్మవారి ఆలయప్రాకారం మండపంలో నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- క్యూలలోని భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం, బిస్కెట్లు అందజేస్తామన్నారు.
- గంగా గౌరి సందన్, యాత్రిక నివాస్, దేవస్థానం వైద్యశాల వద్ద భక్తులకు ఉచితంగా శుద్ధజలం పంపిణీ కేంద్రాలు ఉండగా, అదనంగా మరో నాలుగు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
- కాలినడకన వచ్చే భక్తుల కోసం కైలాసద్వారం, హఠకేశ్వరం, వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
- భక్తులరద్ధీకనుగుణంగా పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
- ఉగాది ఉత్సవాలలో శివదీక్షా శిబిరాల వద్ద ప్రప్రథమంగా కర్ణాటక సంప్రదాయ వంటలతో భక్తులు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తామన్నారు.
- ఉత్సవాలలో ఐదు రోజల పాటు భక్తులను అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.