మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య
ఇల్లెందుఅర్బన్: కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుయాత్ర ఆదివారం ఇల్లెందు ఏరియాకు చేరుకుంది. ఈ సందర్భంగా 21 ఇన్‌క్లైన్‌లో ఏర్పాటు చేసిన పిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌తో గుర్తింపుసంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనమూ లేకుండాపోయిందన్నారు. టీబీజీకేఎస్ నేతలు గ్రూపుల కుమ్ములాటలతో కార్మిక సమస్యలను గాలికివదిలేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు కార్మికులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నాయకులు,మిర్యాల రంగయ్య, కె.సారయ్య, సకినాల రాజేశ్వర్‌రావు,నూనె శ్రీనివాస్, కోటేశ్వర్‌రావు, కొమరయ్య, నజీర్‌అహ్మద్, బాసశ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.