పవన్ ప్లెక్సీలు ధ్వంసం..ఉద్రిక్తత | unknnown persons removes pawan flexis in bimavaram | Sakshi
Sakshi News home page

పవన్ ప్లెక్సీలు ధ్వంసం..ఉద్రిక్తత

Published Thu, Sep 3 2015 12:06 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

unknnown persons removes pawan flexis in bimavaram

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళన చేశారు. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ చింపారంటూ బీభత్సం సృష్టించారు. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఫ్యాన్స్‌ కట్టిన ఫ్లెక్సీలను ఎవరో చింపేశారు.  అయితే హీరో ప్రభాస్‌ అభిమానులే వాటిని చింపేశారంటూ.... పవన్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ.... ప్రభాస్‌ ఫ్లెక్సీలను చించేసి... రోడ్డుమీద పడేసి నిప్పంటించారు.

 

అంతేకాకుండా రోడ్డు పక్కనున్న షాపులను కూడా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాత్రి సమయంలో రాస్తారోకో చేసి... రోడ్డుపై నిప్పుపెట్టి హంగామా చేశారు.  అనుమానితుల ఇళ్లపై ...పవన్ అభిమానులు రాళ్లతో దాడి చేశారు. వీరి ఆందోళనల ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రజలు హడలిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement