పవన్పై కాపు మహిళల ఆగ్రహం | pawan kalyan flexis set to be fire in guntur district | Sakshi
Sakshi News home page

పవన్పై కాపు మహిళల ఆగ్రహం

Published Sun, Feb 7 2016 4:30 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్పై కాపు మహిళల ఆగ్రహం - Sakshi

పవన్పై కాపు మహిళల ఆగ్రహం

గుంటూరు: పవన్ కళ్యాణ్ పై మహిళా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తామందరం ఒక్కతాటి పై కాపుల కోసం పోరాడుతుంటే కనీసం మద్దతు కూడా తెలపడం లేదని ఆదివారం పవన్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. కేవలం తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సూచన మేరకే టీడీపీకి ఓటేశామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అభిమానంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారే, ఇప్పడు వాటిని కాల్చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా రేపల్లేలో చోటుచేసుకుంది.

వివిధ పార్టీల్లో ఉన్న కాపులు కూడా కేవలం పవన్ చెప్పాడన్న కారణంతో ఒక్కతాటిపైకి వచ్చి టీడీపీకి ఓటేసి గెలిపించాము. అయితే రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా పవన్ ప్రశ్నించడంలేదు, కనీసం కాపు సమస్యల పైనైనా పోరాడటంలేదని వారు ధ్వజమెత్తారు. అయితే రెండు రోజుల కిందే ఫ్లెక్సీలను తీసేసినా, ఇప్పడు మహిళలు వాటిని దగ్థం చేసి ధర్నా నిర్వహించారు.

మరో వైపు జిల్లా వ్యాప్తంగా ముద్రగడ దీక్షకు మద్దతు తెలుపుతూ..కాపు నాయకులంతా రిలే నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టారు.  నిరసన ప్రదర్శనలు చేస్తున్న కాపునాయకులను పోలీసులు రేపల్లెలో అడ్డుకున్నారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. అనుమతిలేకుండా ప్రదర్శనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాపునాయకులు నినాదాలు చేశారు. అయితే  కాపు రిజర్వేషన్ల కోసం మహిళలు కూడా ఈ సారి ఎక్కువగా బయటకు రావడం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement