నెట్టెంపాడు నీటిని వినియోగించుకోండి
Published Thu, Aug 18 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
గొర్లఖాన్‌దొడ్డి (గట్టు ) : నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి గ్రామాల శివారుల్లోని నెట్టెంపాడు ప్రధాన కాలువ వెంట ఆయన పర్యటించారు. ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి, చాగదోన, బల్గెర, ఇందువాసి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులతో గొర్లఖాన్‌దొడ్డి గ్రామ సమీపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టుకు ఎగువ నీటి నీటి ప్రవాహం కొనసాగుతున్నందున నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి కాలువలకు సాగునీటిని వదులుతున్నారన్నారు. రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని ప్రధాన కాలువకు గండి పెట్టకుండా క్రమపద్ధతిలో నీటిని వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, కోఆప్షన్ మెంబర్ నన్నేసాబ్, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు రామకష్ణారెడ్డి, మహానందిరెడ్డి, హన్మంతు, బస్వరాజుగౌడు, సర్పంచ్‌లు శంకరన్న, సామేలు, ఎంపీటీసీలు చిన్న మహ్మద్, పుల్లారెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Advertisement