వెంకయ్యతో బాలయ్య భేటీ | Venkaiah naidu meeting with N Balakrishna | Sakshi
Sakshi News home page

వెంకయ్యతో బాలయ్య భేటీ

Published Wed, Feb 10 2016 4:03 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

వెంకయ్యతో బాలయ్య భేటీ

వెంకయ్యతో బాలయ్య భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడితో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు రావాలని బాలకృష్ణ ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని కోరారు. ఈ మేరకు వెంకయ్యకు బాలకృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఈ ఉత్సవానికి హాజరయ్యేందుకు వెంకయ్య సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.  అలాగే పలువురు కేంద్రమంత్రులను బాలకృష్ణ కలసి ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రాలు అందజేశారు.  ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనం నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement