‘కుంటనక్కల’ సంగతేంటి? | vennapusa ravindrareddy raise to kuntanakkala issue in general body | Sakshi
Sakshi News home page

‘కుంటనక్కల’ సంగతేంటి?

Published Thu, Jul 13 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

vennapusa ravindrareddy raise to kuntanakkala issue in general body

వాటర్‌షెడ్‌ నిర్మాణాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో అవినీతిపై ‘సాక్షి’ గత మూడు రోజులుగా వరుస కథనాలను ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రచురితమైన ‘కుంటనక్కలు’ కథనం జెడ్ప సర్వసభ్య సమావేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. వాటర్‌షెడ్‌లో అవినీతిని ఆధారాలు సహా ప్రచురిస్తున్నా అధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం బాధాకరమని రవీంద్రారెడ్డి విమర్శించారు. ఇంతలో తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు రవీంద్రారెడ్డి మైక్‌ను కట్‌ చేయించి, ఎదురు దాడికి దిగారు. వాస్తవాలకు సమాధి కట్టే ప్రయత్నం చేశారు. సభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతుండగానే డ్వామా పీడీ నాగభూషణంను మంత్రి సునీత తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. వార్తలు వాస్తవమేనని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సభ్యులకు మంత్రి సర్దిచెప్పారు.
- అనంతపురం సిటీ

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement