మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా అంత్యక్రియలకు విరసం నేత కల్యాణ్ రావ్ హాజరయ్యారు.
ఒంగోలు: మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా అంత్యక్రియలకు విరసం నేత కల్యాణ్ రావ్ హాజరయ్యారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని కల్యాణ్ రావు మండిపడ్డారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై హత్య కేసు నమోదు చేయాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఎన్కౌంటర్ చేసిన వారిపై హత్య కేసు నమోదు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
ఏవోబీ ఎన్కౌంటర్ బూటకమని ఆర్కే భార్య శిరీష ఆరోపించారు. ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మంది తల్లులు కడుపు కోతకు గురయ్యారన్నారు.