'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్ | voting continues in warangal, khammam and achampet | Sakshi
Sakshi News home page

'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్

Published Sun, Mar 6 2016 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్

'ఆ మూడు చోట్ల' కొనసాగుతున్న పోలింగ్

హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. సదరు ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో 58 డివిజన్లు, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లో 50 డివిజన్లు, అచ్చంపేటలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్లో మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 6, 43,862 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అచ్చంపేటలో పంచాయతీ ఎన్నికల కోసం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 18614 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉదయం పది గంటల వరకు అచ్చంపేటలో 19 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్లో ఉదయం 11.00 గంటల వరకు 18.5 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు నేటి సాయంత్రం 5.00 గంటలకు ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement