కాలిబాట భక్తులకు ఆధార్ తప్పనిసరి: టీటీడీ
సాక్షి, తిరుమల: టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు గదుల బుకింగ్, అంగప్రదక్షిణం టికెట్ల నమోదులో ఆధార్‌ను అధికారులు తప్పనిసరి చేశారు. అదే విధానాన్ని ఇకపై కాలిబాట భక్తులకు వర్తింపచేయాలని టీటీడీ నిర్ణయించింది.
దీనిప్రకారం కాలిబాటల్లో వచ్చే భక్తులకు ప్రస్తుతం స్వీకరిస్తున్న ఫొటోమెట్రిక్ విధానాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఆధార్ నంబరు నమోదు చేసుకుని దివ్యదర్శనం(కాలిబాట) టికెట్లు ఇవ్వనున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనార్థం శ్రీలంక ప్రధాని రణీల్ విక్రమ సింగే, సతీమణి మైత్రి విక్రమ సింగేతో కలసి తిరుమలకు చేరుకున్నారు.