హంద్రీకి నీరు విడుదల చేయాలి
Published Sat, Aug 27 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
– ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జల మండలి ఎదుట ధర్నా
కర్నూలు సిటీ: హంద్రీనీవా కాలువ నుంచి హంద్రీనదికి నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆసంఘం ఆధ్వర్యంలో శనివారం జల మండలి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలై మూడు నెలలు అయినా ఇంత వరకు హంద్రీనదిలో నీటి ప్రవాహం అగుపించలేదన్నారు. దీంతో నది పరివాహాక ప్రాంతాల్లోని బావులు, బోర్ల అడుగంటిపోవడంతో నీరందక సాగు చేసిన పంటలు ఎండుతున్నాయన్నారు. కూలీలకు పనులు కూడా కరువయ్యాయన్నారు. గతంలో హంద్రీనది జీవనదిలో ఉండేదని, దీంతో నది తీర ప్రాంతాల్లో రెండు సీజన్లలో పంటలు పండేవన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదని చెప్పారు. జిల్లా అధికారులు స్పందించి హంద్రీనీవా కాలువ నుంచి కొంత నీరు హంద్రీనదికి ఇవ్వాలని కోరారు.S మాల్యాపల్లె, తోగర్చేడు గ్రామాల దగ్గర ప్రధాన కాలువలకు ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం పాణ్యం డివిజన్ కార్యదర్శి బి.సోమన్న, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రైతు కూలీ సంఘం నాయకులు వెంకటస్వామి, సి.వీరన్న, నరసింహూలు, పోతన్న, హంద్రీ పరిరక్షణ కమిటీ నాయకులు శేషగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement