అనంతపురం : నగరంలోని మిస్సమ్మ స్థలాన్ని తాము చట్టపరంగా కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి స్పష్టం చేశారు. మిస్సమ్మ స్థలం కొనుగోలుకు సంబంధించిన విషయంలో గురునాథరెడ్డి, ఆయన సోదరులు ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డితోపాటు పులివెందులకు చెందిన ప్రకాష్‌రెడ్డి తదితరులపై ప్రత్యేక సీఐడీ కోర్టు చార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో గురునాథరెడ్డి మాట్లాడారు. తమపై బురదజల్లే కార్యక్రమం తప్ప ఇందులో ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎస్‌ఐ అనేది చట్టబద్ధమైన సంస్థ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కుల ప్రకారమే తాము కొనుగోలు చేశామన్నారు. దీనిపై సీఐడీ గతంలోనే విచారణ చేసి ఏమీ లేదని తేల్చిందన్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి చార్జిషీటు వేయించిందని ఆరోపించారు. దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. అమ్మిన వారు ఎవరైనా కేసులు పెట్టారా, పోనీ హక్కుదారులు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ కూడా చెల్లించి కొనుగోలు చేశామన్నారు. ఈ స్థలాన్ని తాము కబ్జా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. కేవలం తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిస్సమ్మ భూమి చట్టపరంగానే కొన్నాం
Published Thu, Mar 9 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement