శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ డివిజన్‌లోని యువ సంక్షేమ అధికారులందరు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆర్కే 5 గని సంక్షేమ అధికారి ఎం.రాజేశ్ అదృశ్యం అయిన కేసులో వీరు ఈ నిరసన తెలిపారు. రాజేశ్ ఆ గని మేనేజర్ వేధింపులు తాళలేక విధుల పట్ల విరక్తి చెంది తన కోసం చూడద్దు, మేనేజర్ తీవ్రంగా వేధిస్తున్నాడని అందుకే తాను వెళ్లిపోతున్నానని, ధైర్యం ఉంటే చనిపోతా లేకుంటే పారిపోతా తప్ప ఇక తిరిగిరాను అని భార్య సుభాషిణి మెస్సేజ్ పెట్టి సెల్ ఫోన్‌ను కార్యాలయంలోనే వదిలేసి అదృశ్యం అయ్యాడు.
అంతకు కొద్ది సేపు ముందు తండ్రికి కూడా ఇదే తరహా మేనేజర్ వేధిస్తున్నాడని మెస్సేజ్ పెట్టి పెట్టాడు. దీనిపై గురువారం రాత్రి శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్ అదృశ్యం అయినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఆయన ఆచూకి లభించలేదు. దీంతో రాజేశ్ అదృశ్యం ఘటనపై ఆయన బ్యాచ్‌కు చెందిన యువ సంక్షేమ అధికారులంతా కలిసి ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం రాజేశ్ భార్య, తండ్రి శ్రీనివాస్‌ను తీసుకొని శ్రీరాంపూర్ జీఎం సుభానిని కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనేజర్ వేధింపుల వల్లే రాజేశ్ అధృశ్యం అయ్యాడని తెలిపారు.
అన్ని గనుల్లో అధికారులు తమను వేధిస్తున్నారని సంక్షేమ అధికారులు వాపోయారు. చీటికి మాటికి ఇష్టం వచ్చినట్లు దుర్భషలాడుతున్నారని పని చేసిన కూడా తిట్టుతున్నారని వాపోయారు. ఎంత పని చేసిన గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. ఇదిలా ఉంటే తన కొడుకు రాజేశ్ మేనేజర్ వేధింపులు తాళలేకనే అదృశ్యం అయ్యాడని అతనికి ఏదైన జరిగితే యాజమాన్యందే బాధ్యత వహించాలని డిమాండ్ తండ్రి శ్రీనివాస్ చేశారు. తన భర్త అదృశ్యం అయిన తరువాత కూడా యాజమాన్యం సరిగా స్పందించలేదని రాజేశ్ భార్య సుభాషిణి ఆరోపించింది. తన భర్తను వెంటనే వెతికి తమకు అప్పగించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఎ‹స్‌ఓటుజీఎం పివి సత్యనారాయణ, టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డీజీఎం(పర్సనల్) జే కిరణ్, పీఎం అనిల్‌కుమార్, డైవైపీఎం తుకారాం, పలువురు సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
దొరకని ఆచూకి..
రాజేశ్ కోసం పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వెతుకుతన్న అతని ఆచూకి ఏమాత్రం దొరకడం లేదు. గని నుంచి నేరుగా నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్‌కు వెళ్లి అక్కడ తన స్నేహితుడు అభిషేక్‌ను బైక్‌పై మంచిర్యాల బస్‌స్టేషన్‌లో దించమనడంతో అతని దింపు వచ్చాడు. దీంతో బస్ స్టేషన్‌నుంచి ఎటూ వెళ్లిందో పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. తోటి సంక్షేమ అధికారులు కూడా రాజేశ్ స్నేహితులకు, క్లాస్‌మేట్స్‌కు సమాచారం అందించిన ఎలాంటి అచూకి లభించలేదు. రాజేశ్‌వెంట సెల్‌ఫోన్ లేకపోవడంతో అతని ఆచూకి కనుకోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. రాజేశ్ ఆచూకి తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దొరకని ఆచూకీ
Published Fri, Jun 9 2017 6:14 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
Advertisement
Advertisement