ఆ పోలీస్ ఏమయ్యాడు?! | What happened to that police ?! | Sakshi
Sakshi News home page

ఆ పోలీస్ ఏమయ్యాడు?!

Published Mon, Jan 23 2017 11:38 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

What happened to that police ?!

అనంతపురం :  విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అదృశ్యమై 21 సంవత్సరాలు గడిచినా ఆచూకీ లభించలేదు. ఒక్కగానొక్క కుమారుడి కోసం బంధువులతో కలిసి వెతుకుతూ చివరకు అనారోగ్యంతో తల్లి కన్నుమూసింది. పోలీసులు మాత్రం ఈ కేసును ఇప్పటి వరకు కొలిక్కి తేలేదు. అసలు బతికి ఉన్నాడా.. లేక ఎవరైనా చంపేసి శవాన్ని మాయం చేశారా అనేది మిస్టరీగా ఉండిపోయింది. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.   
 
కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఎం.వన్నూరప్ప, కొల్లమ్మ దంపతులు. వన్నూరప్ప మాజీ సైనికుడు. రైల్వేలో డీజిల్‌ డ్రైవర్‌గా ఉద్యోగం రావడంతో అనంతపురం జిల్లా గుంతకల్లుకు వచ్చి స్థిరపడ్డాడు. వీరికి ఆరుగురు కూతుళ్లు కాగా దామోదర్‌ ఆంజనేయులు ఏకైక కుమారుడు. కొడుకు స్థిరపడకనే తండ్రి కన్నుమూశాడు. 1993 బ్యాచ్‌లో దామోదర్‌ ఆంజనేయులు (నంబర్‌ 2019) పోలీస్‌కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. 1994లో విడపనకల్లు పోలీస్‌స్టేçÙ¯ŒSకు పోస్టింగ్‌ ఇచ్చారు. అక్కడే పని చేస్తూ 1995 ఫిబ్రవరి 15న అదృశ్యమయ్యాడు. 
కన్నీటి వ్యథగా 21 ఏళ్ల నిరీక్షణ: కనిపించకుండా పోయిన దామోదర్‌ ఆంజనేయులు కోసం తల్లి, బంధువులు గాలించారు. బంధువులు, స్నేహితులను, తోటి పోలీసులను ఆరా తీశారు. దేశం నలుమూలలా తిరిగారు. ఆచూకీ లేదు. ఒక్కగానొక్క కుమారుడి పెళ్లి చేసి ఆ సంతోషం చూడాలని కలలు గన్న ఆ తల్లికి నిరాశే మిగిలింది. వస్తాడో రాడోనన్న బెంగతో మంచానపడిన తల్లి కొల్లమ్మ చివరకు పక్షపాతం వచ్చి తీవ్ర అనారోగ్యంతో ఆరేâýæ్ల కిందట మృతి చెందింది.
 
కేసు పురోగతిపై సమాచారం అడిగిన బంధువు: ఇదిలాఉండగా కానిస్టేబుల్‌ దామోదర్‌ ఆంజనేయులు అదృశ్యంలో కేసు పురోగతి వివరాలు కోరుతూ బంధువు ఎస్‌.అనిల్‌కుమార్‌ సమాచార హక్కు చట్టం కింద విడపనకల్లు స్టేష¯ŒS హౌస్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశాడు. అరకొర సమాచారం ఇవ్వడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై సమాచార హక్కు కమిషనర్‌కు సైతం దరఖాస్తు చేశాడు. 
 
పలు అనుమానాలు: దామోదర్‌ ఆంజనేయులు ఆదృశ్యంపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందురోజు తల్లికి ‘అమ్మా..నేను డ్యూటీకి వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు నీకు కావాల్సిన మందులు, చీర తెస్తాన’ని చెప్పి వెళ్లాడని అనిల్‌కుమార్‌ తెలిపాడు. 1995 ఫిబ్రవరి 15న సాయంత్రం 7 గంటలకు స్టేష¯ŒS నుంచి బయటకు వెళ్లాడని తోటి సిబ్బంది  చెబుతున్నారు. రూముకు వెళ్లాడా...భోజనానికి హోటల్‌కు వెళ్లాడా...ఇంకెక్కడిౖకెనా వెళ్లాడా అనేది చెప్పలేకపోతున్నారు.

21ఏళ్ల కిందట వాహనాల రాకపోకలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవేâýæ ఆంజనేయులు బస్టాండుకు వచ్చి ఏదైనా వాహనం ఎక్కినా కచ్చితంగా అక్కడి వారు చూసే వీలుంది. తాము ఆయన గదిని పరిశీలించగా యూనిఫాం మంచంపై పడి ఉంది. ముఖ్యంగా తను వాడే పర్సు, చెప్పులు, బ్యాగు, బెల్టు అక్కడే ఉన్నాయి. అతని రూములో ఉండే మరో కానిస్టేబుల్‌ను అడగగా...ఎస్‌ఐతో గొడవపడి ఎక్కడికో వెళ్లిపోయాడని ఓసారి, ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు అంటూ మరోసారి మాట్లాడాడు.

విడపనకల్లు సమీపంలో మట్కా, పేకాట నిర్వహించే వారితో దామోదర్‌ ఆంజనేయులు, మరో కానిస్టేబుల్‌ గొడవ పడినట్లు తెలిసిందని బంధువులు చెబుతున్నారు. అలాగే విడపనకల్లు పీఎస్‌లో 38/1995 కేసు నమోదు చేసినా విచారణ సరిగా జరగలేదంటూ అనిల్‌కుమార్‌ ఆరోపిస్తున్నాడు.  
 
కేసు రీఓపెన్ చేయాలి: ఈ కేసును రీ ఓపె¯ŒS చేసి సదరు కానిస్టేబుల్‌ బతికే ఉన్నాడా...లేదా అనేది తేల్చాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. చంపి శవాన్ని మాయం చేసి ఉంటారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కీలక సమాచారం అప్పటి సిబ్బందికి తెలుసునని వారిమీదకు వస్తుందనే భయంతో గోప్యంగా ఉంచారని ఆరోపిస్తున్నారు. సామన్య ప్రజలకు ఇబ్బందులు వస్తే వెంటనే  పోలీసులు గుర్తుకొస్తారని, మరి పోలీసులకే హాని జరిగితే ఎవరికి చెప్పుకోవాలని వారు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని దామోదర్‌ ఆంజనేయులు కేసు మిస్టరీని ఛేదించి 21 ఏళ్లుగా తాము పడుతున్న నరకయాతన నుంచి విముక్తులను చేయాలని, కారకులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement