
టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తామంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో కొద్దిపాటి ఇళ్లే మంజూరవుతున్నందున ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్లకే అవకాశమిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల రుణాలు మంజూరుచేస్తే తప్పేంటని బొజ్జల ప్రశ్నించారు.