Minister BOJJALA Gopal Krishna Reddy
-
వచ్చే నెల్లో ఎర్రచందనం వేలం
రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెంకటగిరి : అటవీశాఖ కార్యాలయాల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను సెప్టెంబర్‌లో వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వెలిగొండల నుంచి ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు అటవీప్రాంతంలో కందకాలు తవ్వనున్నట్లు తెలిపారు. ఇక వనమహోత్సవాన్ని అన్ని శాఖల అధికారులు ఉద్యమంగా చేపట్టడంతో రాష్ట్రంలో 1.25 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. ఎస్ఎస్ కెనాల్ (స్వర్ణముఖి– సోమశిల) నిర్మాణ పనులను వేగవంతం చేశామన్నారు. కాలువ నిర్మాణంలో భూముల కోల్పోయిన వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమేనని, సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులను బయటకు వచ్చేయాలని, బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌డీవీ ప్రసాద్‌నాయుడు, సీనియర్ టీడీపీ నాయకుడు చెలికంశంకరరెడ్డి పాల్గొన్నారు. -
నవ నిర్మాణ దీక్ష
ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల ప్రతిజ్ఞ చిత్తూరులో మంత్రి బొజ్జల ఆధ్వర్యంలో.. చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పీసీఆర్ కూడలిలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన నవనిర్మాణ దీక్ష బహిరంగ సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు టీడీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు సైతం చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ప్రపంచంలోనే రాజధాని లేకుండా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ నవ నిర్మాణంలో ముఖ్యమంత్రికి సహకారం అందించాలని, ఇందుకు ప్రజల్లో ఒక ఉద్యమస్ఫూర్తి రావాలన్నారు. అంతకుమునుపు మంత్రి అందరి చేత రాష్ట్ర నవ నిర్మాణానికి కృషి చేస్తామని సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లాకు సంబంధించి వివిధ పథకాల్లో సాధించిన ప్రగతి పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు . ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, టీడీపీ నాయకులు దొరబాబు, బద్రీనారాయణ, పాచిగుంట మనోహర్, షణ్ముగం, ఉపాధ్యాయ సంఘ నాయకుడు గంటా మోహన్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా , ఎస్పీ శ్రీనివాస్, జేసీ-2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్ఓ విజయ్‌చందర్, ఆర్డీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీ సీఈవో పెంచల కిషోర్, డ్వామా, డీఆర్డీఏ, హౌసింగ్ పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, వెంకటరెడ్డి, నగరపాలక కమిషనర్ సురేష్, మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గొల్లపూడికి ‘జీవన సాఫల్యం’
ఈ నెల 12 నుంచి జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు పాలకొల్లులో ఈ నెల 12 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రతి నిధులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మానాపురం సత్యనారాయణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాటకోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావును జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, గజల్ శ్రీనివాస్,ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ముర్రు ముత్యాల నాయుడు, సినీ పరిశ్రమ నుంచి కోడి రామకృష్ణ, ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, భాస్కరభట్ల, అనితా చౌదరి పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
టీడీపీ వాళ్లకే ఇళ్ల రుణాలిస్తాం: మంత్రి బొజ్జల
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తామంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్ల రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో కొద్దిపాటి ఇళ్లే మంజూరవుతున్నందున ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వాళ్లకే అవకాశమిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇళ్ల రుణాలు మంజూరుచేస్తే తప్పేంటని బొజ్జల ప్రశ్నించారు. -
ప్రతిపక్షాలు లోపాలు చెబితే స్వాగతిస్తాం
♦ ప్రత్యేక హోదాతో మేలుపై సందేహం లేదు ♦ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వి.కోట : పాలనలో ఉన్న లోపాలను ప్రతిపక్షాలు చెబితే స్వాగతిస్తావుని రాష్ట్ర అటవీ శాఖా వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వి.కోటలో నిర్వహించిన విలేకరుల సవూవేశంలో ఆయున పలు విషయూలను వెల్లడించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్ర నిధులు అవసరవున్నారు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోలేవుని వ్యాఖ్యానిం చారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. 33 శాతం అడవుల ఏర్పాటులో భాగంగా బంజరు, వృథా భూవుులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ భూముల్లో అడవులను పెంచుతావున్నారు. ఇందుకోసం 12 లక్షల హెక్టార్ల భూమిని సేకరిస్తావున్నారు. తమిళనాడుకు వృథాగా తరలుతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు కౌండిన్య, కైగల్ తదితర చోట్ల వాటర్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తావున్నారు. -
శాస్త్రోక్తంగా అక్షర దీవెన
1800మంది విద్యార్థులు హాజరు సర్వాంగ సుందరంగా గురు దక్షిణామూర్తి ముస్తాబు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహి క అక్షరాభ్యాసం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, ఆలయ ఈవో బి.రామిరెడ్డి పిల్లలతో పలకపై ఓం నమఃశివాయ అని తొలి అక్షరం దిద్దించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపథ మండపం వద్ద పూలమాలలతో నిండైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మొదట గురు దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ ఆధ్వర్యంలో వేదపండితులు సరస్వతీదేవి పూజలను మంత్రోచ్ఛారణలతో జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంతోపాటు శ్రీకాళహస్తి మండలం, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు 1800 మంది బుధవారం ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసంలో అధికారికంగా పాల్గొన్నారు. పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు దేవస్థానం పలకలు, బలపాలు,పెన్నులు, 100 గ్రాముల బియ్యం, పులిహోర, లడ్డులను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ శాంతారామ్ జే పవార్, టీడీపీ సీనియర్ నాయకుడు పోతుగుంట గురవయ్యనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్యనాయుడు, పలువురు కౌన్సిలర్ పులి మోనిక, టీడీపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమ, ఆలయాధికారులు, పెద్ద ఎత్తున పలువురు భక్తులు పాల్గొన్నారు. 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి 700 మంది విద్యార్థులు తగ్గారు. ఆలయాధికారులు అక్షరాభాస్యంపై సరైన ప్రచారం చేయకపోవడంతోనే విద్యార్థుల సంఖ్య తగ్గింది.