♦ ప్రత్యేక హోదాతో మేలుపై సందేహం లేదు
♦ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
వి.కోట : పాలనలో ఉన్న లోపాలను ప్రతిపక్షాలు చెబితే స్వాగతిస్తావుని రాష్ట్ర అటవీ శాఖా వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వి.కోటలో నిర్వహించిన విలేకరుల సవూవేశంలో ఆయున పలు విషయూలను వెల్లడించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్ర నిధులు అవసరవున్నారు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోలేవుని వ్యాఖ్యానిం చారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
33 శాతం అడవుల ఏర్పాటులో భాగంగా బంజరు, వృథా భూవుులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ భూముల్లో అడవులను పెంచుతావున్నారు. ఇందుకోసం 12 లక్షల హెక్టార్ల భూమిని సేకరిస్తావున్నారు. తమిళనాడుకు వృథాగా తరలుతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు కౌండిన్య, కైగల్ తదితర చోట్ల వాటర్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తావున్నారు.
ప్రతిపక్షాలు లోపాలు చెబితే స్వాగతిస్తాం
Published Thu, Sep 24 2015 4:29 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement