ఈ నెల 12 నుంచి జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు పాలకొల్లులో ఈ నెల 12 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రతి నిధులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, మానాపురం సత్యనారాయణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాటకోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావును జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు.
ఈ సభలో ముఖ్య అతిథులుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, గజల్ శ్రీనివాస్,ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ముర్రు ముత్యాల నాయుడు, సినీ పరిశ్రమ నుంచి కోడి రామకృష్ణ, ఆర్‌పీ పట్నాయక్, హీరో నిఖిల్, భాస్కరభట్ల, అనితా చౌదరి పాల్గొననున్నారని పేర్కొన్నారు.
గొల్లపూడికి ‘జీవన సాఫల్యం’
Published Wed, Mar 2 2016 4:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement
Advertisement