నెట్‌ బ్యాంకింగ్‌తో బీమా చెల్లింపు సులభం | with net banking paying bhima is easy | Sakshi
Sakshi News home page

నెట్‌ బ్యాంకింగ్‌తో బీమా చెల్లింపు సులభం

Published Tue, Aug 30 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

with net banking paying bhima is easy

చింతలపూడి: ఎల్‌ఐసీ (జీవిత బీమా సంస్థ) ఆన్‌లైన్‌ బాట పట్టింది. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ప్రీమియం చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సులభంగా ప్రీమియాన్ని చెల్లించవచ్చు. దీనికోసం మీ సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి నెట్‌ బ్యాంకింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.  
లాభాలు ఇలా.. ప్రీమియం చెల్లింపునకు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లనవసరం ఉందు. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉంటే ఎక్కడి నుంచైనా చెల్లింపులు జరుపవచ్చు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించనవసరం లేదు. మీ ఖాతా నుంచి సొమ్ములు ఎప్పుడు చెల్లించాలో ముందుగా షెడ్యూల్‌ చేయవచ్చు. చెల్లించాల్సిన ప్రీమియం, ఇతర పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు.  
ఏఏ పాలసీలకు..ఏ పాలసీలయితే నెట్‌వర్క్‌డ్‌ బ్యాంకుల్లో కొనుగోలు చేసి ఉంటారో వాటిని, మ్యాన్‌ (మెట్రో ఏరియ నెట్‌వర్క్‌), వ్యాన్‌( వైడ్‌ ఏరియానెట్‌వర్క్‌) ద్వారా యాక్సెస్‌ చేయగలిగిన పాలసీల చెల్లింపులు నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుపవచ్చు. త్రైమాసికం, అర్ధ వార్షికం, వార్షిక రూపేణా చెల్లింపులు జరిపేలా తీసుకున్న సాధారణ పాలసీలన్నింటికీ ఈ విధంగా చెల్లింపులు చేయవచ్చు. సింగిల్‌ ప్రీమియం, సాధారణ నెలవారీ ప్రీమియం, శాలరీ సేవింగ్‌ స్కీమ్‌ వంటి వాటికి నెట్‌ బ్యాంకింగ్‌ చెల్లింపులు జరిపే వీలు లేదు. 
ఉచితం.. ఉచితం..నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా ప్రీమియం చెల్లించే సౌకర్యం పూర్తిగా ఉచితం. బ్యాంకులు, సర్వీస్‌ ప్రొవైడర్లతో ఎల్‌ఐసీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు వారికి ఎల్‌ఐసీ రుసుములు చెల్లింపులు. వినియోగదారులు ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు.  
ఈ బ్యాంకుల్లో సౌకర్యంహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్, ఫెడరల్‌ బ్యాంక్‌ కార్పొరేషన్, సిటీ బ్యాంక్‌లు ఎల్‌ఐసీ నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం కలిగి ఉన్నాయి. 
సర్వీసు ప్రొవైడర్లు బిల్‌ జంక్షన్‌.కామ్, టైమ్స్‌ఫ్‌మనీ.కామ్, బిల్‌ డెస్క్‌.కామ్‌ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. 
బ్యాంకుల వద్ద నమోదు ఇలా..పైన తెలిసిన బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న పాలసీదారుడు నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం పొందాలి. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వార నెట్‌ బ్యాంకింగ్‌ను వినియోగించవచ్చు. మరింత సమాచారం కోసం బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  
సర్వీసు ప్రొవైడర్ల వద్ద నమోదు 
ఎంపిక చేసిన పట్టణాల్లో ఏ బ్యాంక్‌ ఖాతా ఉన్నా పాలసీదారులు సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా‡ ప్రీమియం చెల్లించేందుకు నమోదు చేసుకోవచ్చు. సర్వీసు ప్రొవైడర్‌ మిమ్మల్ని రాతపూర్వకంగా మ్యాండేట్‌ అడుగుతారు. మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ప్రీమియం కోసం సొమ్ము చెల్లింపులకు మీరు అంగీకరిస్తే మీ బ్యాంక్‌ ఖాతా నుంచి సొమ్ములు డెబిట్‌ చేస్తారు. ఇందుకు సర్వీసు ప్రొవైడర్లు అడిగిన బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలను అందించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement