జన్‌ధనాధన్
జన్‌ధన్ ఖాతాలకు లక్ష్మీకళ
పెద్ద నోట్ల రద్దుతో పెరిగిన జమ
కొందరి నల్లధనం చేరుతోందా?
అనుమానిస్తున్న బ్యాంకు అధికారులు
పెద్దనోట్ల రద్దు పుణ్యమాని జన్‌ధన్ యోజన ఖాతాలు కాసులతో గలగలాడుతున్నారుు. పైసా కూడా లేకుండా ఇన్నాళ్లూ నిద్రాణంగా ఉన్న ఈ ఖాతాల్లో ఒక్కసారిగా వేలు, లక్షలు వచ్చి పడ్డారుు. పేదలంతా ఒక్కసారిగా ఖాతాల్లో వేయడంతో అందరి నోటా ఈ ఖాతాలు చర్చనీయాంశమయ్యారుు. నల్లకుబేరులు దాచుకున్న సొమ్మును జన్‌ధన్ ఖాతాదారుల అకౌంట్లో వేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నారుు. దీంతో ఈ ఖాతాలపై బ్యాంకు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
సాక్షి: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నల్లధనం ఎంతవరకు అరికట్టవచ్చో తెలీదుగానీ.. పేదల జన్‌ధన్ ఖాతాల్లోకి మాత్రం భారీగా నగదు చేరుతోందని విశ్వసనీయ సమాచారం. ఖాతా తెరిచినప్పటి నుంచి నామమాత్రంగా ఉన్నా ఇప్పుడు లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. పెద్దనోట్ల రద్దు ఈ ఖాతాలకు కలిసొచ్చింది. జిల్లాలో 5.16 లక్షల జన్‌ధన్ ఖాతాలు ఉన్నారుు. పెద్దనోట్ల రద్దు ప్రకటన ముందు వరకు వీటిలో రూ.20 కోట్లు మాత్రమే ఉండేది. జీరో బ్యాలెన్‌సతో బ్యాంకు అకౌంట్ అంటే ఓపెన్ చేసుకున్న జనం తరువాత చాలామంది పైసాకూడా జమ చేయలేదు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం సొమ్ము వచ్చి పడుతోంది. ఖాతాల్లో కొంత డబ్బైనా జమ చేయాలని గతంలో అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. వారం కిందట ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటన చేయడంతో బుధవారం వరకు రూ.500కోట్లకుపైగా జమైనట్లు భోగట్టా.
జన్‌ధన్ ఖాతాల్లోకి నల్లడబ్బు..?
జన్‌ధన్ ఖాతాల్లోకి జమయ్యేది నల్లకుబేరుల సొమ్మేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బ్యాంకు అధికారులు. జిల్లాలోని కొంతమంది ధనికులు పేదలకు కొంత కమీషనిచ్చి పని కానిస్తున్నారని సమాచారం. గ్రానైట్, ఇసుక, ఎరచ్రందనం అక్రమ వ్యాపారాలతో సంపాదించిన సొమ్మును ఈ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఎరచ్రందనం తరలింపులో పేరుగాంచిన ఓ బడా నాయకుడు రూ.10 వేలకు రూ.2 వేలు కమీషన్, రూ.20 వేలకు రూ.3 వేలు, రూ.లక్షకు రూ.10 వేలు ఇచ్చి ఖాతాల్లోకి నల్లధనాన్ని ప్రవహింపజేస్తున్నారని తెలుస్తోంది. నలుపు కావొచ్చు, తెలుపు కావొచ్చు ఖాతాలు మాత్రం కరెన్సీతో నిండుగా కళకళలాడుతున్నారుు.