ఉరవకొండ రూరల్ : బైక్‌పై నుంచి జారిపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు... వై.రాంపురం గ్రామానికి చెందిన మల్లప్ప భార్య జయమ్మ (45) తన కొడుకు అనిల్‌తో కలిసి ద్విచక్రవాహనంపై శనివారం వై.రాంపురం నుంచి విరుపాపల్లికు బయల్దేరింది. మార్గం మధ్యలో దిచక్రవాహనం మీద నుండి కిందకు పడి తీవ్ర గాయాలపాలైంది. ఈమెను హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.