పావగడ : పావగడ తాలూకాలోని అరసికెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కేటీ హళ్లి గ్రామానికి చెందిన పుట్ట నర్సమ్మ (60) అనే మహిళా రైతు అప్పుల బాధ భరించలేక ఆదివారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ.2.50 లక్షలు ఉన్నాయి. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవన్మరణానికి పాల్పడింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీకాంత్ తెలిపారు.