Published
Sat, Mar 25 2017 11:59 PM
| Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నందికొట్కూరు: గార్గేయపురం గ్రామానికి చెందిన మాలన్‌బీ, హిదాయత్ అలీ దంపతుల కుమార్తె షాజహాన్(25) శనివారం ఒంటికి నిప్పుపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కుమార్తె, 6 నెలల కుమారుడున్నారు. భర్త మగ్బూల్ టైలర్ వృతి చేస్తు కుటుంబాన్ని పోషించేవాడు. షాజహాన్ కొన్నాళ్లుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తోందని బంధువులు తెలిపారు. వైద్యుల దగ్గర చికిత్సలు చేయించిన ఫలితం కనిపించలేదన్నారు. ఎప్పుడు ఏమి చేస్తుందో తెలియని స్థితిలో తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకున్ని నిప్పు పెట్టుకుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ లక్ష్మినారాయణతో మాట్లాడగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.