వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద మృతి
Published Tue, Aug 16 2016 2:03 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
ఆలూరు రూరల్ : సుళువాయి గ్రామానికి చెందిన నాగవేణి(25) ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆలూరుకు చెందిన గోపాల్, గోవిందమ్మ దంపతుల మొదటి కుమార్తె నాగవేణి ఎమ్మెస్సీ, బీఎడ్ వరకు చదువుకుంది. ఈమెను హŸళగుంద మండలం సుళువాయికి చెందిన నాగమ్మ, అంజనయ్య కుమారుడు నాగరాజుకు ఇచ్చి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. నాగరాజు పదో తరగతి పూర్తి చేసి, వ్యవసాయ చేసేవాడు. వీరికి సాయిఅర్జున్ అనే నాలుగేళ్ల కుమారుడున్నారు. ఆదివారం పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన నాగవేణి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో స్పృహ లేకుండా పడి ఉంది. వెంటనే ఆమె భర్త ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఆలూరులోనే ఉన్నప్పటికీ వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భర్త మృతదేహాన్ని అదే ఆటోలో సులువాయి గ్రామానికి తీసుకెళ్లాడు. అయితే విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం రాత్రి గ్రామానికి వెళ్లి అత్తారింటివారితో గొడవకు దిగారు. కూతురు మృతిపై అనుమానాలున్నాయంటూ మృతదేహాన్ని సోమవారం ఆలూరు ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పోస్టుమార్టం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హŸళగుంద హెడ్ కానిస్టేబుల్ బీరప్ప తెలిపారు.
Advertisement