మహిళా సాధికారిత పుస్తకావిష్కరణ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సోషియాలజీ విభాగం సోషల్‌వర్క్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.గౌరీశంకర్ రచించిన ‘దళిత మహిళా సాధికారిత’ పుస్తకాన్ని, ‘దళిత మహిళా స్థితిగతులు’ అనే అంశంపై డాక్టర్ సాంబశివరావు సమర్పించిన పరిశోధనా గ్రం«థం తెలుగు అనువాదాన్ని శుక్రవారం వర్సిటీ వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో దళిత మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి పుస్తకాలు రచించటం అభినందనీయమన్నారు. పుస్తక రచయిత డాక్టర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ యూజీసీ మంజూరు చేసిన ప్రాజెక్ట్ ద్వారా చేసిన విశ్లేషణను రీగల్ పబ్లికేషన్ వారి సహకారంతో పుస్తకరూపంలో అందరికీ అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ మాజీ వీసీ ఆచార్య కె వియ్యన్నారావు, పుస్తక రచయిత డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.