విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభించిన చంద్రబాబు, ఆ తర్వాత రోడ్డును పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగివున్న మహిళలను ఈ సందర్భంగా చంద్రబాబు పలకరించారు. కాగా తమకు ఇళ్ల స్థలాలు లేవని, పిల్లలకు ఉద్యోగాలు లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిని ఇక్కడే కడుతున్నామని, అందరికీ అన్నీ వస్తాయంటూ చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.