women angry
-
ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. కొలికపూడిపై భగ్గుమన్న మహిళలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చిట్టేల మహిళలు భగ్టుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడి సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.కాగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వారం రోజులుగా జరుగుతున్న రగడకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తలంటి దూకుడు తగ్గించుకోవాలని, నాయకులను కలుపుకొని పోవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుడ్డలూడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును సైతం నాయకులు కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.ఇంతవరకు నియోజకవర్గంలోని సీనియర్ల ముఖం సైతం చూడని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఖరిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ‘తిరువూరును రక్షించండి’ నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే, అధిష్టానం ఆదేశాలతో విరమించుకున్నారు. దీనికి తోడు ఫేస్బుక్ వేదికగా ‘అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్ పెట్టడంతో టీడీపీ నాయకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం, విలేకరులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం తదితర ఘటనలతో పార్టీకి, ప్రజలకు ఎమ్మెల్యే దూరమవుతున్నారని గ్రహించిన అధిష్టానం వెంటనే నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. -
చంద్రబాబుపై మహిళల ఆగ్రహం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని పరిస్థితి ఎదురైంది. బుధవారం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభించిన చంద్రబాబు, ఆ తర్వాత రోడ్డును పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగివున్న మహిళలను ఈ సందర్భంగా చంద్రబాబు పలకరించారు. కాగా తమకు ఇళ్ల స్థలాలు లేవని, పిల్లలకు ఉద్యోగాలు లేవని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిని ఇక్కడే కడుతున్నామని, అందరికీ అన్నీ వస్తాయంటూ చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సత్యనాదెళ్ల వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వారికి ఆగ్రహం తెప్పించాయి. ఆరిజోనాలో ఓ కంప్యూటింగ్ సదస్సులో స్టేజి మీద చర్చలో మాట్లాడుతున్నప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహిళలు కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నా, జీతాల పెంపు విషయంలో మాత్రం అసలు సంతృప్తిగా ఉండట్లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించినప్పుడు నాదెళ్ల స్పందించారు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని, అప్పుడు మనకు పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. మహిళలు జీతాల పెంపు గురించి అడగక్కర్లేదని, వాళ్లు సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగొస్తుందని అన్నట్లు తెలిసింది. అయితే సత్య నాదెళ్ల వాదనతో ఆ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యురాలు, కాలేజి ప్రెసిడెంట్ మారియా క్లావే తీవ్రంగా విభేదించారు. వెంటనే ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి. ఒకే ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు వస్తున్నాయని ఇప్పటికే పలు పరిశోధనలలో తేలింది. దీన్ని కూడా పరిష్కరించాలని, ఇందుకోసం మహిళలు హోంవర్క్ చేయాలని క్లేవ్ సలహా ఇచ్చారు. అయితే, ఈ వివాదానికి సత్యనాదెళ్ల ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పరిశ్రమలో వేతనాల విషయంలో లింగ వివక్ష తగ్గాలని ఆయన అన్నారు. కర్మసిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు సూచించడంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ ఓ మెమో కూడా పంపినట్లు తెలిసింది. ఆ ప్రశ్నకు అంతకుముందు తానిచ్చిన సమాధానం తప్పని కూడా అందులో పేర్కొన్నారు. Was inarticulate re how women should ask for raise. Our industry must close gender pay gap so a raise is not needed because of a bias #GHC14 — Satya Nadella (@satyanadella) October 9, 2014 -
బొత్స పేరెత్తితే మండిపడుతున్న మహిళలు