నిర్లక్ష్యంతోనే నా భార్యను చంపేశారు | women dead doctors irresponsibility | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతోనే నా భార్యను చంపేశారు

Published Tue, Nov 8 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

women dead doctors irresponsibility

కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : 
నిర్లక్ష్యంతో తన భార్యను చంపేసారని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆరోపించాడు. కోలమూరుకు చెందిన కె.వెంకటరమణమ్మ(50) చికిత్సపొందుతూ మృతి చెందడంతో ఆసుపత్రి వద్ద కుటింబీకులు, బంధువులు మంగళవారం ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు...రాజమహేంద్రవరం రూరల్‌ కోలమూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ కె.వెంకటేశ్వరావు భార్య వెంకటరమణమ్మ  కొంతకాలంగా ఆయాసంతో బాధపడుతోంది. ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు గుండెలో వాల్వ్‌ పాడైందని చెప్పారు. వారు అక్కడ నుంచి తిరిగి ఆర్టీసీ డిపోలో ఉండే సంస్థ వైద్యురాలికి విషయం తెలిపారు. ఆమె సంస్థ తరపున వైద్యం చేయించేందుకు దానవాయిపేటలోని కమలాకర్‌ హార్ట్‌కేర్‌కు మాత్రమే వెసులుబాటు ఉందని చెప్పడంతో  గత నెల 25న కమలాకర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు 29న వాల్‌్వకు సంబంధించి ఆపరేష¯ŒS చేశారు. తర్వాత ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు. తిరిగి ఆమెకు ఆయాసం రావడంతో వేరే ఆసుపత్రికి మార్చాలని చెప్పారని, మళ్లీ ఎందుకో ఆసుపత్రి మార్చకుండా ఆ వైద్యులే ఇక్కడికి వస్తారని తాత్సారం చేసినట్టు భర్త వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో ఆమెకు పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతిచెందింది. విషయాన్ని కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో వారు వైద్యుని నిలదీసారు. దీనిపై ఆసుపత్రి ఎదుట ఆందోళనచేపట్టి ధర్నా చేశారు. తన భార్య మృతికి  బ్రెయి¯ŒSస్ట్రోక్,  పక్షవాతం, ఊపిరితిత్తుల సమస్య ఇలా పొంతనలేని కారణాలు చెబుతున్నారన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్‌నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతోను, డాక్టర్‌తోను మాట్లాడారు. జరిగినదానిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కమలాకర్‌ మాట్లాడుతూ రోగి పరిస్థితి బాగానే ఉందని, అయితే వాల్వ్‌ ఆపరేష¯ŒS చాలా క్లిష్టమైందని, సర్జరీ తర్వాత రోగి కోలుకునే శరీరం సహకరించడం బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement