కడుపునొప్పితో మహిళ ఆత్మహత్య | women suicide | Sakshi
Sakshi News home page

కడుపునొప్పితో మహిళ ఆత్మహత్య

Published Sat, Oct 8 2016 11:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

women suicide

అనంతపురం సెంట్రల్‌: నగరంలో నీరుగంటివీధిలో రామసుబ్బమ్మ(47) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ నాగమధు తెలిపిన వివరాల మేరకు... నీరుగంటివీధిలో శివ అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య రామసుబ్బమ్మ తరుచూ కడుపునొప్పితో బాధపడుతుండేది.  శనివారం ఆమె కడుప్పునొప్పి తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగమధు చెప్పారు. 
వివాహిత .. 
అమరాపురం: మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన వివాహిత Ôశృతి (24) పురుగుల మందుతాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త శివకుమార్, ఏఎస్‌ఐ ఈరన్న తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకుచ్చారు.
 
అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కర్ణాటక ప్రాంతం తుమకూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఈరన్న తెలిపా రు. అయితే ఆత్మహత్యకు గల కార ణాలు తెలియరాలేదు. భర్త శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement