- గూడ్సురైలు కింద పడటంతో ముక్కలైన మృతదేహాలు
- కుటుంబ కలహాలే కారణం..
- రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం
యేడాది కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్య
Published Thu, Jul 28 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
కేసముద్రం : ఏడాది వయసున్న కుమారుడితో కలిసి ఓ తల్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇంటికన్నె గ్రామానికి చెందిన కొర్రె శ్రీనివాస్ మహబూబ్‌నగర్‌లోని గ్లోబల్ కళాశాలలో బీటెక్ చదివాడు. ఆ సమయంలో అదే జిల్లాలోని మాల్ గ్రామానికి చెందిన అలివేలు(22)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి రెండేళ్ల క్రితం అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు కౌశిక్(13 నెలలు) జన్మించాడు.
అయితే కొంతకాలంగా కుటుంబంలో గొడవలు తలెత్తుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన అలివేలు ఇటీవల రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి దగ్గరలో ఉన్న రైల్వేట్రాక్‌పైకి వెళ్లిందని, గమనించిన వారు ఆమెను మందలించడంతో తిరిగి ఇంటికి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ కుటుంబంలో గొడవ జరగడంతో అలివేలు కౌశిక్‌తో సహా గురువారం ట్రాక్‌పైకి వెళ్లి గూడ్సురైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె మృతదేహం ముక్కలు ముక్కలు కాగా, కౌశిక్ తల, కాళ్లు, చేతులు నుజ్జునుజ్జయి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లీకొడుకులు మృతిచెందిన తీరు చూసి కన్నీటì పర్యంతమయ్యారు. అనంతరం జీఆర్పీ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరీశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement