
ఔరా..సొర..!
సహజంగా పెరట్లో రెండు నుంచి మూడు కేజీల సోరకాయలు పెరగడం చూస్తాం. కానీ కోడూరుకు చెందిన నంద్యాల శ్రీనివాసరావు పంటపొలం గట్టున నాటిన సొరపాదుకు ఏకంగా 15 కేజీల సొరకాయలు కాసి అబ్బురపరుస్తున్నాయి. మూడు నెలల క్రితం శ్రీనివాసరావు గుంటూరు నుంచి సొరగింజలు తీసుకువచ్చి పొలం గట్టున నాటారు. ప్రస్తుతం ఈ పాదు పెద్దదై పెద్దమొత్తంలో సొరకాయలు కాయగా, అవి 15 కేజీలకు పైగా బరువు ఉన్నాయి. ఎలాంటి ఎరువులు ఉపయోగించకుండానే ఈ సొరకాయలు కాశాయని శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
- కోడూరు