దుర్గమ్మవారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
క్యూ లైన్లలోని భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వైద్యం అందించడం కూడా చాలా కష్టంగా మారింది. కొద్దిసేపటి క్రితం భక్తుల తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై కిందపడ్డ ఓ వృద్ధురాలిని వైద్య నిమిత్తం బయటికి తీసుకురావడం చాలా కష్టమైందని భక్తులు తెలిపారు.