యువకుడి దుర్మరణం
Published Tue, Aug 30 2016 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
యలమంచిలి : మండలంలోని 214 జాతీయ రహదారిపై కలగంపూడి జిట్స్ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఏనుగువానిలంక గ్రామానికి చెందిన చెల్లుబోయిన రాంబాబు (26) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాంబాబు తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో ఇటీవల రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేయించారు. అయినా కోలుకోకపోవడంతో రాజోలు ఎండీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజోలు ఆస్పత్రిలో ఉన్న తండ్రిని చూసి రాంబాబు తిరిగి మోటార్ సైకిల్‌పై స్వగ్రామం ఏనువానిలంక వస్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మోటార్ సైకిల్‌ను ఈడ్చుకెళ్లి పోవడంతో రాంబాబు అక్కడికక్కడే Mýన్నుమూశాడు. వీఆ ర్వో కె.శ్రీనివాస్ సమాచారం మేరకు సీఐ ఎ.చంద్రశేఖర్ పర్యవేక్షణలో యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించి ఎస్సై అప్పారావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఉమా మహేశ్వరరావు పంచాయతీ వార్డు మెంబరు కాగా రాంబాబు తూర్పుగోదావరి జిల్లా శివకోడులోని ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.
Advertisement
Advertisement