రోజా పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా | YSRCP MLA RK Roja suspension petition postponed to monday | Sakshi
Sakshi News home page

రోజా పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా

Published Fri, Mar 11 2016 9:22 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

రోజా పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా - Sakshi

రోజా పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీః తనను అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్‌సీపీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు రాగా రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు సంసిద్ధమయ్యారు.

అయితే ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని, తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ కెహర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన సలహా తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్వర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement