'గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి' | ysrcp sc cell president speaks on Tribal laws, implementation | Sakshi
Sakshi News home page

'గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి'

Published Fri, Dec 4 2015 5:13 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

'గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి' - Sakshi

'గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శుక్రవారం గిరిజన చట్టాలు, అమలు తీరుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, బాలరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ... చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు దాటిన.... ఎన్నికలకు ముందు గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవోను చంద్రబాబు సర్కార్ ఉపసంహరించుకోవాలని లేనిచో చంద్రబాబుకు పుట్టగతులుండవని హెచ్చరించారు. తక్షణమే గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలని మేరుగ డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలో చట్టాలను అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. విద్యార్థులకు 40శాతం స్కాలర్షిప్లు పెంచినది దివంగత నాయకుడే అన్నారు. గిరిజనులు, దళితులు వైఎస్ఆర్కు రుణపడి ఉన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. దళితులు, గిరిజనులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని మేరుగ నాగార్జున అన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement