వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ప్రవేశాలు | Admissions into YSR NITHM | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ప్రవేశాలు

Published Thu, Jun 19 2014 1:01 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ప్రవేశాలు - Sakshi

వైఎస్‌ఆర్ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ప్రవేశాలు

మారుతున్న ప్రజల అభిరుచులు.. ఖాళీ సమయాన్ని ఆస్వాదించడానికి ప్రాధాన్యతనిస్తుండడం.. వెరసి పర్యాటక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు జనంతో నిండిపోతున్నాయి.. అదే క్రమంలో సంబంధిత విధులు నిర్వహించడానికి మానవ వనరులు కూడా పుష్కలంగా అవసరం.. అలాంటి మానవ వ నరులను తీర్చిదిద్దే సంస్థల్లో హైదరాబాద్‌లోని డాక్టర్ వైఎస్‌ఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐటీహెచ్‌ఎం) ఒకటి.. ఈ ఇన్‌స్టిట్యూట్ 2014-15 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 అందిస్తున్న కోర్సులు:
 -    పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 (పీజీడీఎం-టూరిజం మేనేజ్‌మెంట్)
     అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఐసెట్ పరీక్షలలో క్వాలిఫై అయి ఉండాలి.
     వ్యవధి: రెండేళ్లు
 -    ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ
 -జేఎన్‌టీయూ, హైదరాబాద్ సహకారంతో)
     అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఐసెట్ పరీక్షలలో క్వాలిఫై అయి ఉండాలి.
     వ్యవధి: రెండేళ్లు
 -    ఎంబీఏ (హాస్పిటాలిటీ)
     అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా డిగ్రీ/ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం లేదా కుటుంబపరంగా ఉన్న హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తుండాలి. క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఐసెట్ పరీక్షలలో క్వాలిఫై అయి ఉండాలి.
     వ్యవధి: రెండేళ్లు
 -    బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)
     అర్హత: 10+2తోపాటు ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈలో క్వాలిఫై అయి ఉండాలి.
     వయసు: 22 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు 25 ఏళ్లు)
     వ్యవధి: మూడేళ్లు
 -    బీబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ-జేఎన్‌టీయూ, హైదరాబాద్ సహకారంతో)
     అర్హత: 10+2తోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
     వయసు: 22 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు 25 ఏళ్లు)
     వ్యవధి: నాలుగేళ్లు
 
 ప్రవేశం:
 -    పీజీడీఎం-టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులో నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
 
 -    ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ) కోర్సులో నిర్దేశించిన పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో వివిధ అంశాలకు వెయిటేజీ కేటాయించారు. అవి..గ్రాడ్యుయేషన్‌కు 25 శాతం, ఐసెట్/మ్యాట్ వంటి పరీక్షల్లో అర్హతకు 25 శాతం, ఇంటర్వ్యూకు 25 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు.
 -    ఎంబీఏ (హాస్పిటాలిటీ) కోర్సులో నిర్దేశించిన పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాన్ని ఖరారు చేస్తారు.
 
 -    బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో.. ఎన్‌సీహెచ్‌ఎంసీటీ-జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్)లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం.
 
 -    బీబీఎం కోర్సులకు మూడేళ్ల డిప్లొమా (ట్రావెల్ అండ్ టూరిజం) లేదా డిప్లొమా (హాస్పిటాలిటీ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ) విద్యార్థులు కూడా అర్హులే. ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రమంలో వివిధ అంశాలకు వెయిటేజీ కేటాయించారు. అవి.. ఇంటర్మీడియెట్‌కు 50 శాతం, ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు 25 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజిక్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్‌అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ అంశాలు ఉంటాయి.
 
 అవకాశాలు:
 కమ్యూనికేషన్ స్కిల్స్, కష్టపడే తత్వం, విశాల దృక్పథంతో వ్యవహరించే గుణం ఉన్న వారు హోటల్ మేనేజ్‌మెంట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఉద్యోగాల విషయం లో ఈ రంగంలో డిమాండ్-సప్లై మధ్య భారీగా వ్యత్యా సం ఉంటోంది. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్,గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఆన్ బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్‌లో, ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీస్, క్రూయిజర్లు, మల్టినేషనల్ హాస్పిటాలిటీస్ సర్వీసెస్‌లోను అవకాశాలుంటాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా స్థిర పడొ చ్చు. ప్రభుత్వ పరంగా కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లో కూడా అవకాశాలుంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ వంటి దేశాల్లో కూడా చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. ఐదంకెల జీతంతో కె రీర్ ప్రారంభించవచ్చు.
 
 -    దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 -    దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 25, 2014.
 -    వివరాలకు: www.nithm.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement