విద్యా, ఉద్యోగ సమాచారం..
టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించే వివిధ పోటీ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఈనెల 26 వరకు ఉండడంతో ఈ నెలలో నిర్వహించాల్సిన వివిధ ఉద్యోగ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్టు (సీబీఆర్‌టీ) తేదీలను కూడా మార్పు చేసినట్లు వివరించారు.
‘సీబీఎస్‌ఈ’ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12 తరగతుల్లో 2016లో పరీక్షలకు హాజరు కాబోయే ప్రైవేటు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఫెయిల్ అయిన వారు, ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం తీసుకొచ్చినట్లు సోమవారం తెలిపింది. ఢిల్లీలో నివాసం ఉండే మహిళా అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటికే 10, 12 తరగతుల పరీక్షలకు హాజరైన నేషనల్ ఓపెన్ స్కూలింగ్ కేటగిరీ అభ్యర్థులు, 2015 పరీక్షలకు హాజరై, ఇంప్రూవ్‌మెంట్ కోసం తిరిగి పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. పరీక్ష ఫీజును ఈ-చలానా లేదా డీడీ రూపంలో ఈ నెలాఖరులోగా చెల్లించవ్చని, పూర్తి వివరాలను (www.cbse.nic.in) వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది.
ఎంపీహెచ్ కోర్సు దరఖాస్తుకు గడువు10
విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు 10 వరకు పొడిగించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ సోమవారం తెలిపారు. హెల్త్ వర్సిటీకి అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ ఈ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా 11లోగా పంపాలన్నారు. వివరాలు యూనివర్సిటీ (హెఛ్‌టీటీపీ://ఎన్టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ లేదా డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
10 నుంచి ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10 నుంచి 19 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 33,416 మంది, ఇంటర్మీడియట్‌కు 37,290 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. గత ఏడాది పరీక్షలకు 98 వేల మంది హాజరయ్యారన్నారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ఈఎస్‌ఐలో పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్
ఈఎస్‌ఐసీ- పశ్చిమ బంగా రీజియన్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌స, హాస్పిటల్స్‌లో వికలాంగుల కోటాలో పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. స్టాఫ్ నర్‌స (ఖాళీలు-3), నర్సింగ్ ఆర్డర్లీ/ ల్యాబ్ అటెండెంట్ (ఖాళీలు-5), ఫార్మాసిస్ట్ (అల్లోపథిక్)(ఖాళీలు-1). రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు http://esi-pgimsrkolkata.org చూడొచ్చు.
హెచ్‌ఏఆర్‌ఎస్‌ఏసీలో వివిధ పోస్టులు
హరియాణా స్పేస్ అప్లికేషన్‌స సెంటర్ (హెచ్‌ఏఆర్‌ఎస్‌ఏసీ).. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.. జూనియర్ రీసెర్‌చ ఫెలో (జేఆర్‌ఎఫ్) /ప్రాజెక్ట్ అసిస్టెంట్ (పీఏ)(ఖాళీలు-5), ప్రాజెక్ట్ కమ్ ల్యాబ్ కమ్ ఫీల్డ్ అటెండెంట్ (ఖాళీలు-2), డేటా కలెక్షన్ అండ్ ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-10), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఖాళీలు-10). దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీలు అక్టోబర్ 14, 15. వివరాలకు http://harsac.org/ చూడొచ్చు.
ఈఎస్‌ఐసీలో స్టెనో, యూడీసీ అండ్ ఎంటీఎస్
ఈఎస్‌ఐసీ పశ్చిమ బంగా రీజియన్ వికలాంగుల కోటాలో.. స్టెనో గ్రాఫర్ (ఖాళీలు-1), అప్పర్ డివిజన్ క్లర్‌క (ఖాళీలు-3), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఖాళీలు-7) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు స్టెనో గ్రాఫర్, యూడీసీలకు 27 ఏళ్లు, ఎంటీఎస్‌కు 25 ఏళ్లకు మించకూడదు.నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తును ‘ది రీజినల్ డెరైక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్ రీజినల్ ఆఫీస్, ఎస్టాబ్లిష్‌మెంట్ బ్రాంచ్-1, పంచదీప్ భవన్, 5/1, గ్రాంట్ లేన్, కోల్‌కతా-700012’కు పంపాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు http://esicwestbengal.org చూడొచ్చు.
ఎన్‌ఈహెచ్‌యూలో డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్లు
నార్‌త-ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ - షిల్లాంగ్.. సెక్షన్ ఆఫీసర్ (ఖాళీలు-3), ప్రైవేట్ సెక్రటరీ (ఖాళీలు-2), కంప్యూటర్ ఆపరేటర్ (ఖాళీ-1), అసిస్టెంట్స్ (ఖాళీలు-6), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-10), స్టెనోగ్రాఫర్ (ఖాళీలు-23), లోయర్ డివిజన్ క్లర్‌క (ఖాళీలు-65), డ్రైవర్ (ఖాళీలు-15) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 26. వివరాలకు www.nehu.ac.in చూడొచ్చు.
ఈఎస్‌ఐ-పీజీఐఎంఎస్‌ఆర్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్‌ఐసీ-పీజీఐఎంఎస్‌ఆర్ - కోల్‌కతా.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు..అనస్థీషియా (ఖాళీలు-2), బయోకెమిస్ట్రీ (ఖాళీలు-1), జనరల్ సర్జరీ (ఖాళీలు-1), ఐసీయూ (ఖాళీలు-2), మెడిసిన్ (ఖాళీలు-1), మైక్రోబయాలజీ (ఖాళీలు-2), ఆఫ్తాల్మాలజీ (ఖాళీలు-1), ఆర్థోపెడిక్ (ఖాళీలు-3), రేడియో డయాగ్నస్టిక్ (ఖాళీలు-4). నిర్దేశిత స్పెషలైజేషన్‌లో పీజీ మెడికల్ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 8. వివరాలకు http://esi-pgimsrkolkata.org చూడొచ్చు.
సీవీఎస్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు
కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైబ్రేరియన్(ఖాళీలు-1), సెక్షన్ ఆఫీసర్ (ఏ/సీ) (ఖాళీలు-1), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్(ఖాళీలు-1), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), ప్రొఫెషనల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), సీనియర్ అసిస్టెంట్ (ఖాళీలు-3), సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ (ఖాళీలు-1), అసిస్టెంట్ (ఖాళీలు-2), జూనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ (ఖాళీలు-2), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (ఖాళీలు-5), ఎంటీఎస్(లైబ్రరీ) (ఖాళీలు-2), ఎంటీఎస్(కంప్యూటర్:ఖాళీలు-1). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 19. వివరాలకు http://cvs.edu.in చూడొచ్చు.