కంప్యూటర్లను కాపాడే.. ఎథికల్ హ్యాకర్ | 'Ethical Hacker' Will Protect School Computer Systems | Sakshi

కంప్యూటర్లను కాపాడే.. ఎథికల్ హ్యాకర్

Published Sat, Jul 26 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

కంప్యూటర్లను కాపాడే.. ఎథికల్ హ్యాకర్

కంప్యూటర్లను కాపాడే.. ఎథికల్ హ్యాకర్

కార్యాలయాల్లో కంప్యూటర్ లేనిదే పని జరగని రోజులివీ. అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. సమస్త సమాచార మార్పిడి ఆన్‌లైన్‌లోనే సాగుతోంది.

అప్‌కమింగ్ కెరీర్: కార్యాలయాల్లో కంప్యూటర్ లేనిదే పని జరగని రోజులివీ. అన్ని రంగాల్లో  కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. సమస్త సమాచార మార్పిడి ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. టెక్నాలజీతో లాభాలు ఉన్నట్లే.. నష్టాలూ ఉన్నాయి. కంప్యూటర్‌లో నమోదు చేసిన సమాచారమంతా భద్రంగా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఒకరు ఉపయోగిస్తున్న కంప్యూటర్‌లో అక్రమంగా ప్రవేశించి, డేటాను అస్తవ్యస్తం చేసి, అంతులేని నష్టం చేకూరుస్తున్న ఘనులు అన్ని దేశాల్లో ఉన్నారు. మరి, కంప్యూటర్లను సురక్షితంగా మార్చలేమా? అలా మార్చేవారే.. ఎథికల్ హ్యాకర్లు. మనదేశంలో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. ఎథికల్ హ్యాకింగ్.
 
 హ్యాకింగ్ అంటే:
ఎవరికీ తెలియకుండా అక్రమంగా కంప్యూటర్‌లోని సమాచారాన్ని తస్కరించడాన్ని హ్యాకింగ్ అంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే యజమాని అనుమతితోనే కంప్యూటర్‌లోకి ప్రవేశించి డేటాను నాశనం చేయడం. కంప్యూటర్ ఎంత సురక్షితంగా ఉంది? దానిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేయాలి? అనే విషయాలను గుర్తించడానికి ఎథికల్ హ్యాకర్లను నియమిస్తారు. కంప్యూటర్  నుంచి తమకు లభించిన కీలక సమాచారాన్ని వీరు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
 
 భారీ డిమాండ్: భారత్‌లో ఐటీ పరిశ్రమలో ఎథికల్ హ్యాకర్ల అవసరం ఎంతో ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డిమాండ్‌కు సరిపడ నిపుణులు అందుబాటులో లేరని చెబుతున్నాయి. ప్రధానంగా బీపీఓ, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వీరికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎథికల్ హ్యాకర్లకు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది.
 
 రాణించాలంటే: ఎథికల్ హ్యాకర్‌గా వృత్తిలో పేరు తెచ్చుకోవాలంటే.. హ్యాకర్లు ఉపయోగించే విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ నాలెడ్జ్ సంపూర్ణంగా ఉండాలి.  జావా, సీ++ వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై పూర్తి పట్టు అవసరం. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘యూనిక్స్’పై పరిజ్ఞానం సంపాదించాలి. తార్కిక ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక వైఖరి ఉండాలి.
 అర్హతలు: మనదేశంలో ఎథికల్ హ్యాకింగ్‌పై సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరొచ్చు.

 వేతనాలు: ఎథికల్ హ్యాకర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో స్కిల్స్ పెంచుకుంటే వేతనం పెరుగుతుంది. మనదేశం కంటే విదేశాల్లో అధిక వేతనాలు అందుతున్నాయి. అక్కడ అనుభవజ్ఞులైన ఎథికల్ హ్యాకర్లకు ఏడాదికి 50 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వేతన ప్యాకేజీ ఉంటుంది.
 ఎథికల్ హ్యాకింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     అంకిత్ ఫాడియా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్
 వెబ్‌సైట్: www.ankitfadia.in
     కోనిగ్ సొల్యూషన్స్
 వెబ్‌సైట్: www.koenig-solutions.com
     ఇన్నోబజ్ నాలెడ్జ్ సొల్యూషన్స్
 వెబ్‌సైట్: www.innobuzz.in
     ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ -ఘజియాబాద్
 వెబ్‌సైట్: www.imt.edu
 
 భద్రతకు ఢోకాలేని కోర్సు
 ‘‘టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కేకొద్దీ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుంటాయి. ముఖ్యంగా గోప్యంగా ఉండాల్సిన బ్యాంకిం గ్, ఫైనాన్స్, ఆర్థిక, రక్షణ, వ్యక్తిగ త విషయా లు బయటకు పొక్కితే ఊహించని ప్రమాదం సంభవించినట్లే. ముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక కార్యకలాపాల్లో చొరబాట్లు ఎక్కువయ్యాయి. ఫోన్‌కాల్స్, ఈ-మెయి ల్స్, ఎస్.ఎం.ఎస్. వంటి దైనందిన టెక్నాలజీలోనూ ఎన్నో మోసాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని అరిక ట్టేందుకు, మోసగాళ్ల ఆగడాలను అడ్డుకునేందుకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఙానమే ఎథికల్ హ్యాకింగ్.  దీన్ని సవాల్‌గా తీసుకొని పనిచేసే వారికి అద్భుతమైన కెరీర్ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, ఐటీ సెక్టార్‌లో మంచి అవకాశాలున్నాయి. సంతృప్తికరమైన వేతనంతో భద్రమైన కొలువును సంపాదించవచ్చు.
 -ఎన్.రామకోటేశ్వరరావు,
 ఐటీ సర్టిఫికేషన్ శిక్షకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement