విదేశీ విద్యకు ఉపకారవేతనం | Foreign education scholarship | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యకు ఉపకారవేతనం

Published Thu, Jan 29 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

విదేశీ విద్యకు ఉపకారవేతనం

విదేశీ విద్యకు ఉపకారవేతనం

 ప్రతిభావంతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ దేశాల ప్రభుత్వాలు భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి.. పీజీ నుంచి పరిశోధన స్థాయి వరకు కోర్సులను తమ దేశంలో పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.. ట్యూషన్ ఫీజు నుంచి మొదలు వసతి ఖర్చులను సైతం భరిస్తున్నాయి.. తద్వారా విదేశీ విద్యను ఉచితంగా  అందుకునే మార్గంగా నిలుస్తున్నాయి.. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తున్న దేశాలు, కోర్సులు,
 సంబంధిత వివరాలు..
 
 చైనా
 సబ్జెక్టులు: చైనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంబీఏ, సెరికల్చర్, అగ్రోనమీ.
 ్‌షిప్ వ్యవధి: 1-4 ఏళ్లు
 అకడమిక్ సెషన్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. స్కాలర్‌షిప్ కింద లాడ్జింగ్, ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులను చెల్లిస్తారు.
 అర్హత: 60 శాతం మార్కులతో ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ. పీజీ కోర్సులకు రెండేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. చైనీస్ లాంగ్వేజ్ కోసం సంబంధిత సబ్జెక్ట్‌లో సర్టిఫికెట్/డిప్లొమా.
 వయసు: 40 ఏళ్లు.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో జనవరి/ఫిబ్రవరిలో ప్రచురిస్తారు.
 
 కొరియా
 సబ్జెక్టులు: బయోటెక్నాలజీ, కొరియన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, అగ్రికల్చర్.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 3-5
 స్కాలర్‌షిప్ వ్యవధి: 3-5 ఏళ్లు
 అకడమిక్ సెషన్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.
 స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను చెల్లిస్తారు.
 అర్హత: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఐఈడీ) నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి.
 వయసు: 40 ఏళ్లు.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి/
 మార్చిలో ప్రచురిస్తారు.
 
 జపాన్
 సబ్జెక్టులు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, క్వాలిటీ అండ్ రిలయబిల్టీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రోబోటిక్స్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జపనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫిషరీస్, జపనీస్ స్టడీస్, ఎర్త్‌కిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్/ఇంజనీరింగ్.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30-35.
 స్కాలర్‌షిప్ వ్యవధి: 18 నెలల నుంచి 2 ఏళ్లు ( నిబంధనల మేరకు పొడిగింపు కూడా లభిస్తుంది).
 అకడమిక్ సెషన్ ఏప్రిల్/అక్టోబర్‌లలో ప్రారంభమవుతుంది. స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, వసతి, మెడికల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ఖర్చులను జపాన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. తిరుగు ప్రయాణానికి విమాన టికెట్లను కూడా అందజేస్తుంది.
 అర్హత: ఎంచుకున్న కోర్సు మేరకు సంబంధిత సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి.
 వయసు: 35 ఏళ్లు.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఏప్రిల్/మేలో ప్రచురిస్తారు.
 
 ఇజ్రాయెల్
 సబ్జెక్టులు: ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మాస్ కమ్యూనికేషన్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, హిబ్రూ లాం గ్వేజ్, జుడాయిజం, హిస్టరీ ఆఫ్ జ్యూయిష్ పీపుల్, అగ్రికల్చర్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, మిడిల్ ఈస్ట్ స్టడీస్.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 5-7.
 స్కాలర్‌షిప్ వ్యవధి: 8 నెలలు.
 అకడమిక్ సెషన్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.
 స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, నివాస, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను ఇజ్రాయెల్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
 అర్హత: వయోపరిమితి లేదు. ఎంచుకున్న కోర్సు మేరకు హ్యుమానిటీస్ విద్యార్థులు సంబంధిత డిగ్రీలో 55 శాతం మార్కులు, అగ్రికల్చర్ విద్యార్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో జనవరి/
 ఫిబ్రవరిలో ప్రచురిస్తారు.
 
 
 బెల్జియం
 సబ్జెక్టులు (మాస్టర్స్ కోర్సులు): అగ్రోనమీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫొనెటిక్స్.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 2.
 స్కాలర్‌షిప్ వ్యవధి: 10 నెలలు
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్.
 వయసు: 35 ఏళ్లు.
 స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్ ఖర్చులను చె ల్లిస్తారు.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి/మార్చిలో ప్రచురిస్తారు.
 
 ఇటలీ
 సబ్జెక్టులు: కేటగిరీ-ఏ కోర్సులు-ఇటాలియన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ (కాల వ్యవధి: 3నెలలు).
 కేటగిరీ-బి కోర్సులు: ఫ్యాషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, ఇటాలియన్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్/ఆర్ట్, ఇటాలియన్ లాంగ్వేజ్ టీచింగ్ తదితరాలు (కాల వ్యవధి: 6-9 నెలలు).
 స్కాలర్‌షిప్ కింద నెలవారీగా కొంత మొత్తం, కోర్సు ఫీజును చెల్లిస్తారు.
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఏప్రిల్‌లో ప్రచురిస్తారు.
 
 మెక్సికో
 సబ్జెక్టులు (పీజీ, పీహెచ్‌డీ): అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, లాటిన్ అమెరికన్ స్టడీస్, స్పానిష్ లిటరేచర్, హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, జాగ్రఫీ.స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 6. స్కాలర్‌షిప్ వ్యవధి: 1-2 ఏళ్లు.
 అకడమిక్ సెషన్ సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభమవుతంది. స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, నెల వారీ ఖర్చులను చెల్లిస్తారు. అర్హత: పీజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్ట్‌లో 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సం బంధిత సబ్జెక్ట్‌లో 65 శాతం మార్కులతో పీజీ ఉండాలి.యసు: 26 ఏళ్లు (పీజీ కోర్సులకు), 30 ఏళ్లు (పీహెచ్‌డీ కోర్సులకు).
 నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో జూన్/జూలైలో ప్రచురిస్తారు.
 
 టర్కీ
 సబ్జెక్టులు (రీసెర్చ్ స్కాలర్‌షిప్): అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 4స్కాలర్‌షిప్ వ్యవధి: 2-8 నెలలు.అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 60శాతం మార్కులతో పీజీ.
 వయసు: 45 ఏళ్లు.నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.
 
 యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే)
 కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్/ఫెలోషిప్స్
 సబ్జెక్టులు (పీజీ/పీహెచ్‌డీ/మెడికల్ విభాగంలో క్లినికల్ ట్రైనింగ్): ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ/బయోకెమికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, అగ్రోనమీ, ఫారెస్ట్రీ, హిస్టరీ, సోషియాలజీ, మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తదితర సబ్జెక్టులు. మెడిసిన్ (క్యాన్సర్ రీసెర్చ్, కార్డియాలజీ, గైనకాలజీ, డెంటిస్ట్రీ తదితర..).స్కాలర్‌షిప్ వ్యవధి: పీజీ-ఏడాది, పీహెచ్‌డీ-మూడేళ్లు, క్లినికల్ ట్రైనింగ్-ఆరు నెలలు.నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఆగస్టు/సెప్టెంబర్‌లలో ప్రచురిస్తారు.
 
 అగాథ హరిసన్ మెమోరియల్ ఫెలోషిప్
 సబ్జెక్టులు (అడ్వాన్స్‌డ్ రీసెర్చ్): హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్.అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ (60 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి) తోపాటు మూడేళ్ల బోధనానుభవం. వయసు:  30-40 ఏళ్లు.నోటిఫికేషన్: ప్రముఖ దినపత్రికలలో ఏప్రిల్/మేలో ప్రచురిస్తారు.
 
 సంప్రదించాల్సిన చిరునామా
 అండర్ సెక్రటరీ (స్కాలర్‌షిప్),
 మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్‌మెంట్,
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్,
 ఎక్స్‌టర్నల్ స్కాలర్‌షిప్ డివిజన్, సెకండ్ ఫ్లోర్,
 వింగ్-6, వెస్ట్ బ్లాక్-1, ఆర్‌కే పురం, న్యూఢిల్లీ-110066.
 వెబ్‌సైట్: http://mhrd.gov.in/
 
 ప్రతిభ ఉండి విదేశాల్లో ఉచితంగా చదవాలనుకునే వారికి చక్కని అవకాశం మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌లు. జపాన్, యూకే, చైనా, ఇజ్రాయెల్, కొరియా తదితర దేశాల ప్రభుత్వాలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, సైన్స్ సంబంధిత విభాగాల్లో పీజీ నుంచి పీహెచ్‌డీ కోర్సులను ఉచితంగానే పూర్తి చేయవచ్చు. స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, భోజన, వసతి, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను చెల్లిస్తారు. కొన్ని దేశాలు ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తున్నాయి. కానీ దక్షిణ భారత విద్యార్థుల్లో ఈ స్కాలర్‌షిప్‌ల పట్ల అంతగా అవగాహన ఉండటం లేదు. ఈ స్కాలర్‌షిప్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల్లోంచి ప్రతిభ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ముందుగా చదవాలనుకుంటున్న యూనివర్సిటీ, కోర్సును ఎంచుకోవాలి. ఈ క్రమంలో మన పూర్తి వివరాలతో సంబంధిత వర్సిటీ డిపార్ట్‌మెంట్ డీన్‌తో ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు (కమ్యూనికేషన్) ప్రారంభించాలి. తర్వాత నిర్దేశించిన విధంగా దరఖాస్తును పూర్తి చేయాలి. దీనికి రెజ్యూమె, దరఖాస్తు చేసుకున్న వర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాన్ని జత చేయాలి. ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.
 
  మొదటి రెండు దశలు భారత్‌లో ఉంటే చివరి దశను సంబంధిత దేశం (దరఖాస్తు చేసుకున్న దేశం)లో నిర్వహిస్తారు. మొదటి దశలో వచ్చిన దరఖాస్తులను ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రెండో దశ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇక్కడ అప్లికేషన్‌తోపాటు జత చేసిన రెజ్యుమె, దరఖాస్తు చేసుకున్న వర్సిటీ డీన్ ఇచ్చిన ప్రత్యుత్తరం వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. తద్వారా చదువు పట్ల నిబద్ధత తెలియడంతోపాటు రౌండో దశకు ఇంటర్వ్యూకు సులువుగా అర్హత సాధించవచ్చు. ఇంటర్వ్యూ బోర్డులో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, ఐఏఎస్ ఆఫీసర్, సైకాలజిస్ట్, సంబంధిత దేశ రాయబార కార్యాలయ ఉద్యోగి ఉంటారు. చివరి దశను సదరు దేశంలో నిర్వహిస్తారు. స్కాలర్‌షిప్ వ్యవధి ఎంచుకున్న కోర్సును బట్టి ఉంటుంది. కొన్ని దేశాల్లో ప్రతిభ ఆధారంగా పొడిగింపు కూడా లభిస్తుంది. మరో కీలక అంశం..ఇటువంటి ప్రభుత్వ స్కాలర్‌షిలకు ఎంపికైన విషయాన్ని రెజ్యూమెలో ప్రస్తావించడం కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుంది.
 -డాక్టర్ కన్నెగంటి రమేశ్ బాబు,
 (ఇజ్రాయెల్ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పోస్ట్‌డాక్టోరల్ చేశారు)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement