విదేశీ విద్యకు చేయూతనిచ్చే.. స్కాలర్‌షిప్‌లు | Scholarships for Foreign Education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యకు చేయూతనిచ్చే.. స్కాలర్‌షిప్‌లు

Published Thu, Oct 10 2013 3:23 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Scholarships for Foreign Education

విదేశీ విద్య.. సన్నాహాల్లో భాగంగా విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే అంశాల్లో స్కాలర్‌షిప్స్ ఒకటి. ఈ దిశగా ఇన్‌స్టిట్యూట్‌షనల్ స్కాలర్‌షిప్స్ విద్యార్థులకు ఎంతో చేయూతనిస్తాయి. ఇటీవలి ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తరహా స్కాలర్‌షిప్‌ల సంఖ్య తగ్గుతోంది. ట్యూషన్ ఫీజు మొదలు కోర్సు కాల వ్యవధిలో అవసరమయ్యే అన్ని ఖర్చులూ అందిస్తున్నారుు. మన దేశంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కూడా పలు దేశాలతో కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం పేరుతో స్కాలర్‌షిప్‌ల విషయంలో చేయూతనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ స్కాలర్‌షిప్‌ల వివరాలు...
 
 గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆయా దేశాలు భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. భారత ప్రభుత్వ మానవ వనరుల  మంత్రిత్వ శాఖ సంబంధిత స్కాలర్‌షిప్‌ల ఎంపిక కోసం విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ జాబితాలో యూకే, న్యూజిలాండ్, చైనా, బెల్జియం, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్, కొరియా, మెక్సికో, నార్వే, టర్కీ, స్లోవేకియా దేశాలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు ఈ దేశాల్లో నిర్దేశిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ, షార్ట్ టర్మ్ కోర్సులు చేయవచ్చు.
 వివరాలకు: www.education.nic.in
 
 
 యూకే
 ఇక్కడ విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్స్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. మెడిసిన్, క్యాన్సర్ రీసెర్చ్, కార్డియూలజీ, గైనకాలజీ, డెంటిస్ట్రీ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసే వారికి.. ఇంజనీరింగ్, సైన్స్, వ్యవసాయం అనుబంధ శాస్త్రాలు, హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ ఔత్సాహికులకు ఈ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారు. పీజీ విద్యార్థులకు ఏడాదిపాటు, పీహెచ్‌డీ వారికి మూడేళ్లు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ- సెయింట్ జాన్స్ కాలేజీలో చేరే విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ అందజేస్తారు. ఇవే కాకుండా బ్రిటిష్ చెన్వెనింగ్ స్కాలర్‌షిప్స్, రోడ్స్ స్కాలర్‌షిప్స్, చార్లెస్ వాలేస్ స్కాలర్‌షిప్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.
 వివరాలకు: www.educationuk.org
 
 
 
 
 యూఎస్‌ఏ
 విదేశీ విద్య దిశగా ఆలోచిస్తున్న ప్రతి విద్యార్థి ఆలోచన యూఎస్‌ఏ చూట్టూ ఉంటుంది. ఈ దేశానికి సంబంధించి అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్స్‌ను పరిశీలిస్తే.. ఇన్‌ల్యాక్స్ స్కాలర్‌షిప్ (www.inlaksfoundation. org)అమెరికాలో (ఐరోపాలో కూడా) రెండేళ్లపాటు ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి ఈ స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. ఫుల్‌బ్రైట్ నెహ్రూస్ మాస్టర్స్ ఫెలోషిప్ ఫర్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ (www.usief.org.in/scripts).. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్ స్టడీస్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రొఫెషనల్ స్టడీస్ అభ్యసించాలనుకునే వారికి ఈ ఫెలోషిప్ అందజేస్తారు. కొలంబియా యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, రోటరీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
 వివరాలకు: www.scholars4dev.com
 


 ఆస్ట్రేలియా
 అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లు..
 ఎండీవర్ అవార్డ్స్: ఆసియా- పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెరిట్-బేస్డ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ఇది. ఆస్ట్రేలియాలో రీసెర్చ్, విద్యాభ్యాసం, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోర్సులు చదివేవారు దీనికి అర్హులు. ఈ అవార్డులు వొకేషనల్, డిప్లొమా కోర్సులు మొదలు రీసెర్చ్, డాక్టోరల్ ప్రోగ్రాంల వరకు అందుబాటులో ఉంటాయి.
 
 ఆస్ట్రేలియన్ లీడర్‌షిప్ అవార్డ్స్: సామాజిక, ఆర్థిక విభాగాలకు చెందిన కోర్సుల్లో చేరే ఆసియా- పసిఫిక్ ప్రాంత విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ డెవలప్‌మెంట్ స్కాలర్‌షిప్స్: ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలకు చెందిన విద్యార్థులు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు కామన్వెల్త్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులకు వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యునెటైడ్ నేషన్స్, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.
 వివరాలకు: www.studyinaustralia.gov.au
 
 
 సింగపూర్
 సింగపూర్‌లో స్కాలర్‌షిప్ పొందిన అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, కొంతమేర నివాస ఖర్చులు, బుక్ అలవెన్స్, కంప్యూటర్ అలవెన్స్‌లని అందిస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లు.. ఏషియాన్ స్కాలర్‌షిప్: ఏషియాన్ సభ్య దేశాలకు చెందిన విద్యార్థులు సింగపూర్‌లో చదువుకునేందుకు ఈ స్కాలర్‌షిప్ తోడ్పడుతుంది. ట్యూషన్‌ఫీజు, నివాస ఖర్చులు లభిస్తాయి. డీఎఫ్‌ఎస్ స్కాలర్‌షిప్: విద్యార్థులు గత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఫారెన్ స్టూడెంట్స్ ఎండోవ్డ్ స్కాలర్‌షిప్: నాలుగేళ్ల కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఏడాదికి 4.5 వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి.
 
 ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ట్రాక్ స్కాలర్‌షిప్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎస్‌ఎంయూ స్కాలర్‌షిప్: నాలుగేళ్ల కోర్సుల్లో చేరిన వారికి ట్యూషన్ ఫీజు, క్యాష్ అలవెన్స్ లభిస్తుంది. యూనివర్సిటీ స్టడీ అవార్డ్స్: వీటిని సింగపూర్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలు తమ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన విద్యార్థులకు మాత్రమే అందిస్తుంటాయి. ఇవేకాక.. జూనియర్ కాలేజ్ (ప్రీ-యూనివర్సిటీ) స్థాయిలో చేరాలనుకునే విద్యార్థులకు ఎస్‌ఐఏ యూత్ స్కాలర్‌షిప్, ఎ-స్టార్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్, ఏషియాన్ స్టూడెంట్ స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 వివరాలకు: www.moe.gov.sg
 
 
 కెనడా
 కెనడాలో డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తోంది. టీచింగ్ లేదా రీసెర్చ్ అసిస్టెన్స్ పేరిట ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది. వీటితో పాటు రోటరీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రీసెర్చ్ అసోసియేట్‌షిప్, సౌవే స్కాలర్స్ ప్రోగ్రాం, భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్‌లు కూడా కెనడాలో పరిశోధనకు వెళ్లే వారికి లభిస్తున్నాయి.
 
 ఇవి కాకుండా ఇతర స్కాలర్‌షిప్స్: రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్స్ (www. sshrccrsh.gc.ca): సోషల్ సెన్సైస్ అండ్ హ్యుమానిటీస్ కౌన్సిల్ అందిస్తున్న ఈ స్కాలర్ షిప్‌ను అందుకోవడానికి హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో పరిశోధన చేసే అభ్యర్థులు అర్హులు. కెనడా ఆసియా-పసిఫిక్ అవార్డ్స్ : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు చెందిన విద్యార్థులు.. కెనడా యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేయడానికి వీలుగా ఈ స్కాలర్‌షిప్ తోడ్పడుతోంది. కెనడా సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థలపై పరిశోధనలకు స్కాలర్‌షిప్ మంజూరులో అధిక ప్రాధాన్యమిస్తారు.
 
 డాక్టోరల్ స్టూడెంట్ రీసెర్చ్ అవార్డ్స్: కెనడా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, అంశాలపై పరిశోధన చేయాలనుకునే వారికి ఈ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్: సోషల్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్, ఇంజనీరింగ్, హెల్త్ స్టడీస్‌లో పరిశోధనలకు ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది.
 వివరాలకు: www.educationauincanada.ca
 
 
 న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌షిప్స్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో పరిశోధనలు చేసే వారికి ఈ స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. విద్యార్థుల అకడెమిక్ కెరీర్ మెరిట్ ఆధారంగా వీటిని మంజూరు చేస్తారు. లెర్న్ ఫెలోషిప్స్: న్యూజిలాండ్ ప్రభుత్వం 2007 నవంబర్‌లో ప్రారంభించిన పథకమే ఈ ‘లెర్న్ ఫెలోషిప్’ ప్రోగ్రాం. గ్రీన్‌హౌస్ వాయువులు, సంబంధిత అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫెలోషిప్‌లను ప్రారంభించారు.
 వివరాలకు: www.newzealandeducated.com
 
 
 జపాన్
 జపాన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జపనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫిషరీస్, జపనీస్ స్టడీస్, ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.
 వివరాలకు: www.education.nic.in
 
 
 స్టడీ అబ్రాడ్ జర్మనీ ఔత్సాహికులకు ఎన్నో స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు ‘ప్రమోషన్ ఆఫ్ టాలెంట్’ పేరుతో ఈ అవకాశాలను అందిస్తున్నాయి. డీఏఏడీ (DAAD) స్కాలర్‌షిప్స్: ఈ స్కాలర్‌షిప్‌లను జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ అందిస్తోంది. డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు ఫెలోషిప్స్, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు శాండ్‌విచ్ మోడల్ ఫెలోషిప్స్, పీహెచ్‌డీ రిజిస్టర్డ్ స్కాలర్స్‌కి ఫెలోషిప్స్ అందిస్తారు.

 

వీటితోపాటు కొన్ని నిర్దేశిత పీజీ కోర్సుల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తారు. కొన్రాడ్ అడన్యూర్ ఫౌండేషన్: పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో పరిశోధకులకు స్కాలర్‌షిప్ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు వెబ్‌సైట్: www.kas.deఫ్రెడ్రిచ్ నౌమన్ ఫౌండేషన్: ఫ్రీ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీకి అందించే ఈ స్కాలర్‌షిప్‌ను యూనివర్సిటీ డిగ్రీ కోసం అడుగుపెట్టే విదేశీ విద్యార్థులకు అందజేస్తారు. హాన్స్ బాక్లెర్ ఫౌండేషన్: అన్ని విభాగాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. పని అనుభవం ఉన్న వారికి మరింత ప్రాధాన్యం.
 వివరాలకు:www.studyin.de
 
 
 యూరోపియన్ యూనియన్ దేశాల్లో పీజీ మొదలు, పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ అందించేది ఎరాస్‌మస్ ముండస్ స్కాలర్‌షిప్స్. దీని ద్వారా యూరోపియన్ యూనియన్ దేశాల్లోని 103 పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
 వివరాలకు: www.ec.europa.eu
 ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నత విద్య కోసం ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్‌ను బ్రిటిష్ కౌన్సిల్ అందజేస్తుంది. వివరాలకు: www.britishcouncil.in
 పపంచవ్యాప్తంగా 9వేల ఇన్‌స్టిట్యూట్‌లలో ఉన్నత విద్య కోసం టోఫెల్ (ఖీైఊఉఔ) స్కాలర్‌షిప్‌ను ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) సంస్థ అందజేస్తుంది. వివరాలకు: www.ets.org
 విదేశాల్లో ఇంజనీరింగ్, నేచురల్ సెన్సైస్, హ్యుమానిటీస్, మెడిసిన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మిలటరీ, నేవల్ అండ్ ఏవియేషన్ సైన్స్ విభాగాల్లో పీజీ కోర్సు చేయాలనుకునే వారికి కె.సి. మహీంద్రా స్కాలర్‌షిప్‌లు చేయూతనిస్తాయి.
 వివరాలకు: www.mahindra.com
 ఐటీసీ సంస్థ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో పీజీ లేదా ఆపై స్థాయి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే వారికి వీటిని అందిస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున రెండేళ్లపాటు స్కాలర్‌షిప్ అందజేస్తారు.
 ప్యూర్ సైన్స్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, లా, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులు నారోత్తమ్ సెక్సారియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంవత్సరానికి గరిష్టంగా పది లక్ష రూపాయల వరకు అందజేస్తారు.
 వివరాలకు:www.nsscholarship.net
 దేబేష్ కమల్ స్కాలర్‌షిప్: హ్యుమానిటీస్, బేసిక్ సెన్సైస్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, టెక్నాలజీ విభాగాల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులకు.
 వివరాలకు: www.sriramakrishna.org
 జేఎన్ టాటా ఎండోమెంట్ స్కాలర్‌షిప్స్: అన్ని రకాల విభాగాల్లో షార్ట్‌టర్మ్ కోర్సుల నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఎంపికైన వారికి కోర్సును బట్టి లక్షన్నర రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు అందజేస్తారు. వివరాలకు: www.dorabjitatatrust.org
 
 ఉపయోగపడే వెబ్‌సైట్స్:
 www.scholarshipsinindia.com
 www.scholarshippositions.com
 www.scholarships.com
 www.scholarshipnet.info
 www.studyabroadfunding.org
 www.eastchance.com
 www.financialaidtips.org
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement