మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో | job in Mazagon Dock Shipbuilders Limited | Sakshi
Sakshi News home page

మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో

Published Wed, Aug 17 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో

మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో

1125 పోస్టులు
 
 కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గ్రేడ్ టెక్నికల్, ఆపరేటివ్ పోస్టులను రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 21 రకాల ఉద్యోగాలు (1125) ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కాంపోజిట్ వెల్డర్, యుటిలిటీ హ్యాండ్ తదితర పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి..
 
 ఐ. మిస్ట్రీ గ్రేడ్:
ఇందులో ఒకే పోస్టు (సెకండ్ క్లాస్ మాస్టర్-1) ఉంది. ఐఐ. స్కిల్డ్ గ్రేడ్-ఐ: ఇందులో 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ డ్రాట్స్‌మ్యాన్-12; జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్)-10; జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)-5; జూనియర్ క్యూ.సీ. ఇన్‌స్పెక్టర్ (మెకానికల్)-11; జూనియర్ క్యూ.సీ. ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్)-1; స్టోర్ కీపర్-3; ఫిట్టర్-158; స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్-133; పైప్ ఫిట్టర్-130; ఎలక్ట్రానిక్ మెకానిక్-49; ఎలక్ట్రీషియన్-144; డీజిల్ క్రేన్ ఆపరేటర్-1; మెషినిస్ట్-8; కంప్రెసర్ అటెండెంట్-3; పెయింటర్-51; కార్పెంటర్-30; కాంపోజిట్ వెల్డర్-138; రిగ్గర్-69:ఐఐఐ. సెమీ స్కిల్డ్ గ్రేడ్-ఐ: ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. యుటిలిటీ హ్యాండ్  (సెమీ స్కిల్డ్)-103; చిప్పర్ గ్రైండర్-65.
 
 విద్యార్హత, అనుభవం: దాదాపు అన్ని రకాల ఉద్యోగాలకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్ ఉండాలి. పెయింటర్, కార్పెంటర్, కాంపోజిట్ వెల్డర్ పోస్టులకు 8వ తరగతితోపాటు అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అన్ని పోస్టులకూ ఏడాది పూర్వానుభవం అవసరం.
 
వయోపరిమితి: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 33 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగుల్లో జనరల్ అభ్యర్థులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు; ఓబీసీలకు 13 ఏళ్లు సడలింపు ఉంటుంది.
 
 వేతనం
 మిస్ట్రీ గ్రేడ్ పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.10 వేలు, రెండో ఏడాది నెలకు    రూ.10,100 బేసిక్ పే చెల్లిస్తారు. దీంతోపాటు ఇండస్ట్రియల్ డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ సబ్సిడీ, సీపీఎఫ్, గ్రాట్యుటీ తదితర భత్యాలు ఉంటాయి.
 
  స్కిల్డ్ గ్రేడ్-1 పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.7,500, రెండో ఏడాది నెలకు రూ.7,575 బేసిక్ పేతోపాటు అలవెన్సులు ఉంటాయి.
 
 సెమీ స్కిల్డ్ గ్రేడ్-1 పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.6,000, రెండో ఏడాది నెలకు రూ.6,060 బేసిక్ పేతోపాటు అలవెన్సులు ఉంటాయి.
 
 ఎంపిక విధానం: స్కిల్డ్ గ్రేడ్-1లోని మొదటి ఆరు రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష; మిగిలిన స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును హిందీ/ఇంగ్లిష్/మరాఠీలో పెద్ద అక్షరాలతో (క్యాపిటల్/బ్లాక్ లెటర్స్‌తో) నింపి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన అన్ని ధ్రువీకరణ పత్రాల నకళ్లతోపాటు అప్లికేషన్ ఫీజు చలాన్‌ను జత చేసి కింది అడ్రస్‌కు కొరియర్/పోస్టులో పంపాలి.  ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాలి.
 
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.140 (రూ.100 ప్రాసెసింగ్ ఫీజు, రూ.40 బ్యాంక్ చార్జీ) చెల్లించాలి.
 
చిరునామా: డీజీఎం (హెచ్‌ఆర్-రిక్రూట్‌మెంట్-ఎన్‌ఈ), రిక్రూట్‌మెంట్ సెల్, సర్వీస్ బ్లాక్-మూడో అంతస్తు, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, డాక్ యార్డ్ రోడ్, ముంబై-400010.
 
 ముఖ్య తేదీలు  
  దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 1.
 
 రాత పరీక్ష తేదీ: రాత పరీక్షకు అర్హులైన అభ్యర్థుల వివరాలను సంస్థ వెబ్‌సైట్/నోటీస్ బోర్డులో 2016, సెప్టెంబర్ 21న అందుబాటులో ఉంచుతారు.  
  వెబ్‌సైట్: www.mazagondock.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement